Uganda : నిన్న మొన్నటి వరకు అప్పు తీసుకున్న వాళ్ల పై వేధింపులు ఎక్కువగా ఉండేవి. కానీ ప్రస్తుతం అప్పు ఇవ్వడం కూడా పాపమైపోయింది. తీసుకున్న అప్పు చెల్లించమన్నందుకు అప్పు ఇచ్చిన వాళ్లపైనే దాడులు జరుగుతున్నాయి. అలాంటిదే ఉగాండాలో జరిగింది. తీసుకున్న అప్పు తీర్చమన్న పాపానికి భారతీయుడిని ఉగాండాకు చెందిన పోలీస్ దారుణంగా కాల్చిచంపాడు. దేశ రాజధాని కంపాలాలో 2.1 మిలియన్ షిల్లింగ్స్ (రూ.46,000) చెల్లించమన్నందుకు భారతీయుడిపై నిందితుడు ఏకే 47తో కాల్పులు జరిపాడు. మే 12న జరిగిన ఘటనలో బాధితుడు ఉత్తమ్ భండారీపై 30 ఏళ్ల ఇవాన్ వాబ్‌వైర్ కాల్పులు జరిపాడు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు అతనిని అరెస్ట్ చేశారు.
Read Also:Masa Shivaratri Special Pooja Live: మాస శివరాత్రి సందర్భంగా ఈ పూజలు చేస్తే..
కాల్పుల ఘటన మొత్తం బ్యాంక్ గదిలోని సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఉత్తమ్ భండారీ కంపాలాలోని టీఎఫ్ఎస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ డైరెక్టర్‌గా పనిచేస్తుండగా.. వాబ్‌వైర్ అతడి క్లయింట్. అతను సంస్థకు చెల్లించాల్సిన అప్పు విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో మే 12న వాబ్‌వైర్‌ను లోన్ మొత్తం చెల్లించాల్సిందిగా ఉత్తమ్ భండారీని డిమాండ్ చేశాడు. ఈ విషయంలోనే ఇద్దరి మధ్య గొడవ జరిగి కోపంలో వాబ్‌వైర్ తన చేతుల్లో ఉన్న ఏకే 47తో కాల్చి చంపాడు. అనంతరం ఏకే 47 రైఫిల్‌ను అక్కడే వదిలి పారిపోయాడని తెలిపారు. ఘటనాస్థలంలో పోలీసులు 13 కాట్రిడ్జ్‌లను స్వాధీనం చేసుకున్నారు.
Read Also:Wednes Day Bhakthi Tv Live: బుధవారం ఈ స్తోత్ర పారాయణం చేస్తే..
పోలీసుల నిందితుడి మానసిక ఆరోగ్యం సరిగా లేదని చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో వాబ్‌వైర్ తుపాకీ వాడకుండా ఉన్నతాధికారులు నిషేధం విధించారు. భండారీ హత్య అనంతరం పోలీసులు నిందితుడిని పట్టుకుని ఉగాండాలోని బుసియా పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఉత్తమ్ భండారీని హత్య చేసిన ఏకే 47 తన రూమ్‌మేట్ నుంచి దొంగిలించినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ హత్య నేపథ్యంలో ఉగాండాలో ఉంటున్న భారతీయులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.