Site icon NTV Telugu

Paris Olympics 2024: ఫైనల్ కి చేరిన భారత షూటర్ స్వప్నిల్.. ధోని నుంచి ప్రేరణ

Paris Olympics

Paris Olympics

పారిస్ ఒలింపిక్స్ 2024లో 50 మీటర్ల రైఫిల్ విభాగంలో భారత షూటర్ స్వప్నిల్ కుసాలే ఫైనల్ చేరి చరిత్ర సృష్టించాడు. 50 మీటర్ల రైఫిల్‌లో ఫైనల్ చేరిన తొలి షూటర్ స్వప్నిల్. ప్రస్తుతం స్వప్నిల్ ఫైనల్లో స్వర్ణంపై గురిపెట్టాడు. ఫైనల్‌కు చేరిన తర్వాత, స్వప్నిల్ మాట్లాడుతూ .. క్రికెట్ లెజెండ్ ఎంఎస్ ధోనీ నుంచి ప్రేరణ పొందానని, తాను కూడా ధోని లాగానే కెరీర్ ప్రారంభంలో రైల్వే టిక్కెట్ కలెక్టర్ గా పనిచేసినట్లు తెలిపారు.

READ MORE: Gold Price Today: నిన్న 800, నేడు 500.. బంగారం ప్రియులకు మళ్లీ షాక్! వెండి ధర పైపైకి

“షూటింగ్‌లో నేను ఏ వ్యక్తిని అనుసరించను. కానీ ఎంఎస్ ధోని అంటే నాకు చాలా గౌరవం. అతను మైదానంలో ప్రశాంతంగా, ఓపికగా ఉంటాడు. అది నాకు నచ్చుతుంది. నేను కూడా ధోనిలాగే టిక్కెట్ కలెక్టర్‌ని కాబట్టి.. ఆయన కథతో నేను కనెక్ట్ అయ్యాను. ప్రపంచకప్ విజేత ధోని బయోపిక్‌ను చాలాసార్లు చూశాను. అతను ఛాంపియన్ క్రికెటర్‌గా పెద్ద విజయాలు సాధించగలడు.” అని స్వప్నిల్ పేర్కొన్నాడు.

READ MORE:Indian Railway: దేశంలోనే నాన్ స్టాప్ రైలు.. 6 గంటల్లోనే 493 కి.మీల జర్నీ..!

మహారాష్ట్రలోని కొల్హాపూర్ సమీపంలోని కమల్‌వాడి గ్రామానికి చెందిన 29 ఏళ్ల స్వప్నిల్ కుసలే 2012 నుంచి అంతర్జాతీయ పోటీల్లో పాల్గొంటున్నాడు. అయితే పారిస్ ఒలింపిక్స్‌లో అరంగేట్రం చేయడానికి మరో 12 ఏళ్లు వేచి ఉండాల్సి వచ్చింది. ఇన్నేళ్లు ఓపిగా ఎదురుచూశాడు. షూటింగ్ లో ప్రశాంతం, ఓపిక చాలా ముఖ్యం. ఈ లక్షణాలు ధోనిలో కూడా పుష్కలంగా కనిపిస్తాయి. కాబట్టి ధోని జీవిత కథతో కుసలే కనెక్ట్ అయ్యాడు.

Exit mobile version