భారతీయ రైల్వేలు ప్రైవేటీకరించబడదని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ స్పష్టంగా చెప్పారు. ప్రతి ఒక్కరికీ సరసమైన సేవలు అందించడంపై ప్రభుత్వం దృష్టి సారిస్తోందన్నారు. ఇటీవల, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఫౌండేషన్ డే కార్యక్రమంలో వైష్ణవ్ మాట్లాడుతూ.. రైల్వే భవిష్యత్తు గురించి చాలా పెద్ద విషయాలు చెప్పారు. రూ.400లోపు ప్రజలు 1000 కిలోమీటర్ల వరకు హాయిగా ప్రయాణించాలన్నదే ప్రభుత్వ ధ్యేయమన్నారు. రాబోయే ఐదేళ్లలో రైల్వేలో పూర్తిస్థాయి పరివర్తన ఉంటుందని.. వందే భారత్, నమో భారత్ వంటి రైళ్లు, కవాచ్ రైలు భద్రతా యంత్రాంగం యొక్క విస్తరణ ఈ మార్పుకు దారి తీస్తుందన్నారు. ఇది రైల్వేలో మార్పుల యుగమని మంత్రి పేర్కొన్నారు.
READ MORE: Pager Blasts: “పేజర్”లతో హిజ్బుల్లా ఎలా దెబ్బతీసింది..? ఇజ్రాయిల్ “మోసాద్” డెడ్లీ ఆపరేషన్ ఇదే..
ప్రైవేటీకరణ ప్రశ్నే లేదు
వైష్ణవ్ మాట్లాడుతూ.. “రైల్వేలను ప్రైవేటీకరించే ప్రశ్నే లేదు. ఇలాంటి పుకార్లు వ్యాపింపజేసే వారు రైల్వేలు మరియు రక్షణ భారతదేశానికి రెండు వెన్నెముకలు అని గుర్తుంచుకోవాలని నేను కోరుతున్నాను. అన్ని రకాల రాజకీయాల నుంచి వారిని కాపాడాలి. రైల్వేలో రాజకీయం ఆగుతుందని ప్రధాని నరేంద్ర మోడీ హామీ ఇచ్చారు. పనితీరు, భద్రత, సాంకేతికత, అందరికీ సరసమైన సేవలను అందించడంపై దృష్టి కేంద్రీకరించబడింది.” అని ఆయన వ్యాఖ్యానించారు. రైల్వే బడ్జెట్‌ను ప్రస్తావిస్తూ.. ప్రస్తుతం రూ.2.5 లక్షల కోట్లుగా ఉందని వైష్ణవ్ తెలిపారు. ఇందులో గత దశాబ్ద కాలంలో 31,000 కిలోమీటర్ల కొత్త రైల్వే లైన్లు వేశారని గుర్తుచేశారు.
READ MORE:Tata Share: సంచలనం సృష్టించిన టాటా షేర్.. లక్ష పెట్టుబడి పెడితే.. రూ. 7.5 కోట్లు అయ్యింది!