NTV Telugu Site icon

IRCTC Super APP: రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. వాటి కోసం ఐఆర్‌సీటీసీ ‘సూపర్‌ యాప్‌’..

Irctc Super App

Irctc Super App

IRCTC Super APP: ప్రతిరోజూ భారతీయ రైల్వే వ్యవస్థ లక్షల మంది ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేరవేస్తుంది. సుదూరాలకు రైలులో ప్రయాణించాలంటే తప్పనిసరిగా టికెట్ బుక్ చేసుకోవాలి. అందుకుగాను ప్రస్తుతం ఐఆర్‌సీటీసీ టిక్కెట్ల బుకింగ్ కోసం ఉపయోగించబడుతుంది. ఇకపోతే, రైలు లైవ్ లొకేషన్ స్థితిని తెలుసుకోవడానికి, అలాగే ఇతర సేవల కోసం మీరు వేర్వేరు యాప్‌లను ఉపయోగించాలి. ఈ సమస్యలను చెక్ చేయడానికి ఐఆర్‌సీటీసీ కొత్త సూపర్ యాప్‌ని పరిచయం చేయబోతోంది. ఈ అప్లికేషన్ ద్వారా అన్ని రకాల రైల్వే సేవలు అందుబాటులో ఉంటాయి. రైల్వే శాఖకు సంబంధించిన టిక్కెట్ల బుకింగ్, పీఎన్ఆర్ స్టేటస్, ట్రాకింగ్ స్టేటస్ కోసం వివిధ యాప్‌లను ఉపయోగించడం కష్టతరంగా మారుతోంది. ఈ సమస్యను పరిష్కరించడానికి భారతీయ రైల్వే కొత్త సూపర్ యాప్‌ను అతి త్వరలో ప్రారంభించనుంది.

Also Read: Canada Cops Beating Hindus: కెనడాలోని గుడిలో హిందువులను కొట్టిన పోలీసులు

ఇక నుంచి ఈ యాప్‌లో టికెట్ బుకింగ్, పీఎన్ఆర్ స్టేటస్, రైలు ట్రాకింగ్ ఒకే యాప్ లో చేయవచ్చు. అంతేకాకుండా, ఈ అప్లికేషన్ రైలులో ప్రయాణిస్తున్నప్పుడు ఆహారాన్ని ఆర్డర్ చేయడానికి కూడా అనుకూలంగా ఉంటుంది. ఇంకా ప్లాట్‌ఫారమ్ టిక్కెట్లు, సాధారణ ప్రవేశ టిక్కెట్లను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయవచ్చు. ఈ సూపర్ యాప్ డిసెంబర్ నెలాఖరులో అందుబాటులోకి రానునట్లు సమాచారం. ప్రస్తుతం, పది కోట్లకు పైగా ప్రజలు ఐఆర్‌సీటీసీ రైల్ కనెక్ట్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసి ఉపయోగిస్తున్నారు. ఇది ప్రస్తుతం అత్యంత ప్రజాదరణ పొందిన రైల్వే యాప్. కేవలం IRCTC మాత్రమే కాకుండా Rail Madad, UTS, Satark, TMC-Direction, IRCTC Air, Portread వంటి యాప్‌లు కూడా రైలు ప్రయాణికులకు సేవలను అందిస్తున్నాయి. ఈ సేవలన్నింటినీ ఓకే సూపర్ అప్లికేషన్ ద్వారా అందించేందుకు భారతీయ రైల్వే సన్నాహాలు చేస్తోంది.

Also Read: Indonesia Volcano Erupts: భారీ అగ్నిపర్వతం విస్ఫోటనం.. తొమ్మిది మంది మృతి

Show comments