Indian Railways: చిన్నారులకు టిక్కెట్‌పై రైల్వేశాఖ కీలక ప్రకటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Indian Railways: రైళ్లలో ఐదేళ్లలోపు చిన్నారులకు కూడా టికెట్ తీసుకోవాలంటూ వస్తున్న వార్తలను రైల్వేశాఖ ఖండించింది. రైళ్లలో ప్రయాణించే చిన్నారుల టికెట్ బుకింగ్ విషయంలో ఎలాంటి మార్పులు ప్రకటించింది. ఒకటి నుంచి ఐదేళ్ల వయస్సు గల పిల్లలకు పెద్దలకు వర్తించే టికెట్ ధరలు వర్తిస్తాయని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని రైల్వేశాఖ స్పష్టం చేసింది. ఐదేళ్ల లోపు పిల్లలందరూ గతంలో తరహాలోనే రైళ్లలో ఉచితంగా ప్రయాణం చేయవచ్చని సూచించింది. అయితే ప్రత్యేకంగా బెర్త్ లేదా సీట్ కేటాయించడం ఉండదని స్పష్టం చేసింది. ఒకవేళ చిన్నారులకు బెర్త్ అవసరమైతే బెర్త్‌కు అయ్యే టికెట్ ధర చెల్లించాల్సి ఉంటుంది. అలాంటి సమయంలో పూర్తిగా పెద్దలకు వర్తించే టికెట్ ధర వర్తిస్తుంది.
Read Also: Focus on Cardiac Arrest Risk Live: ప్రాణాలు తీస్తున్న కార్డియాక్ అరెస్ట్..
Also Read
ఏడాది వయస్సున్న పిల్లలు రైళ్లలో ప్రయాణిస్తే కేంద్ర ప్రభుత్వం ఛార్జీలు వసూలు చేస్తోందని.. ప్రెగ్నెంట్ మహిళలకు అదనపు టికెట్ వసూలు చేయనందుకు బీజేపీ ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పాలంటూ ఇటీవల సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో రైల్వేలు ఇక పేదవాళ్లకు చెందవని.. ఇక బీజేపీకి ప్రజలు ఫుల్ టికెట్ కట్ చేస్తారని సమాజ్‌వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ ట్వీట్ కూడా చేశారు. దీంతో ఈ ప్రచారం నిజమేనని చాలా మంది భావించారు. ఈ మేరకు రైల్వేశాఖ రంగంలోకి దిగి ఈ ప్రచారంపై స్పందించింది. ఈ వార్తలన్నీ తప్పుదోవ పట్టించేవిగా ఉన్నాయని రైల్వేశాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఐదేళ్ల లోపు చిన్నారులకు ప్రయాణం పూర్తిగా ఉచితం అని.. ఒకవేళ ఐదేళ్లలోపు వయస్సు పిల్లలకు బెర్త్ అవసరమైతే బుక్ చేసుకునే అవకాశం ఉందని రైల్వేశాఖ స్పష్టం చేసింది.
తాజావార్తలు
-
INDIA Bloc: రాహుల్ నిరసనకు అఖిలేష్ దూరం.. కాంగ్రెస్-SP మధ్య గ్యాప్?
-
పండుగ పూట EMIల మోత.. హోమ్ లోన్ తీసుకున్నవారిపై భారం ఎంతంటే!
-
Maharashtra: మహా ఘోరం.. పెట్రోల్ బంక్ సీజ్ చేయడానికి వెళ్లిన అధికారి హత్య
-
Zodiac Signs : రాహు-కేతువుల నక్షత్ర సంచారం.. ఈ 4 రాశుల జాతకులకు అదృష్ట యోగం
-
PM Modi: ‘‘మోడీని దించేందుకు ప్రయత్నిస్తున్నారు’’.. సెర్బియా మాజీ అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!