నవంబర్ 19, 20వ తేదీలలో హుస్సేన్ సాగర్ లేక్‌లో భారతదేశానికి చెందిన స్ట్రీట్ సర్క్యూట్ రేసుల ప్రారంభ ఎడిషన్ ‘ఇండియన్ రేసింగ్ లీగ్’ మొదటి రేసును హైదరాబాద్ నగరం నిర్వహించేందుకు సిద్ధంగా ఉంది. రేపు ఇండియన్ రేసింగ్ రన్ లీగ్ ప్రారంభం కానుంది. దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను విడుదల చేశారు. రేపు ఉదయం 8 నుంచి 8:30 గంటల వరకు రేసింగ్ లీగ్‌పై బ్రీఫింగ్ ఉంటుంది. అనంతరం ఉదయం 9గంటల నుంచి 10 గంటల వరకు ఇండియన్ రేసింగ్ లీగ్-ఎఫ్‌పీ1, ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఎఫ్‌పీ2, మధ్యాహ్నం 12 గంటల నుంచి 1గంట వరకు లంచ్ బ్రేక్ ఉంటుంది.
Also Read : Trade Advisory Committee: పదే పదే ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు.. ఆర్థికశాఖ మంత్రి ఎదుట వ్యాపారుల ఆవేదన
తిరిగి మధ్యాహ్నం 3.30 గంటల నుంచి 3.45 గంటల వరకు రేసింగ్(క్వాలిఫైంగ్), సాయంత్రం 4 గంటల నుంచి 4.45 గంటల వరకు రేసింగ్-రేస్1, 4.45 నుంచి 5 గంటల వరకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. అలాగే 20వ తేదీన ఉదయం 11 గంటల నుంచి 11:30 వరకు రేసింగ్ లీగ్ ఎఫ్‌పీ3, మధ్యాహ్నం 12 గంటల నుంచి 1వరకు లంచ్ బ్రేక్ ఉంటుంది. మధ్యాహ్నం 1 నుంచి 1.15 వరకు క్వాలిఫైంగ్ లీగ్ ఉంటుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి 2.45 గంటల వరకు లీగ్ రేస్2 ఉంటుంది. సాయంత్రం 3.30 గంటల నుంచి 4.30 గంటల వరకు రేస్3, అలాగే సాయంత్రం 4.30 గంటల నుంచి 4.45 గంటల వరకు ఇంటర్వ్యూలు ఉంటాయని వెల్లడించారు.
