America: అమెరికాలో మరో భారతీయుడు హత్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెరికాలో (America) వరుసగా భారతీయులు హత్యకు గురికావడం కలవరం రేపుతోంది. ఇటీవలే పలువురు దారుణహత్యకు గురయ్యారు. తాజాగా మరో ఘటన వెలుగు చూసింది. వాషింగ్టన్‌లోని ఓ హోటల్ బయట రోడ్డుపై జరిగిన వాగ్వాదంలో గుర్తు తెలియని దుండగుడి చేతిలో భారత సంతతికి చెందిన ఓ వ్యాపారవేత్త హత్యకు గురయ్యాడు. ఫిబ్రవరి 2న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
భారత సంతతికి (Indian) చెందిన వివేక్ తనేజా(41) (Vivek Taneja) అనే వ్యక్తి వర్జీనియాలో నివాసముంటున్నాడు. ఫిబ్రవరి 2న వాషింగ్టన్‌లోని (Washington Street) ఓ రెస్టారెంట్‌కు వెళ్లిన ఆయన అర్థరాత్రి 2 గంటల సమయంలో బయటకు వచ్చాడు. రోడ్డుపై నడుచుకుంటూ వెళుతుండగా గుర్తు తెలియని వ్యక్తితో వాగ్వాదం చోటుచేసుకుంది. ఇది కాస్తా ఘర్షణకు దారితీసింది. దుండగుడు వివేక్ తలపై దాడి చేశాడు. వివేక్‌ను విచక్షణా రహితంగా నేలకేసి కొట్టాడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ వివేక్ ప్రాణాలు కోల్పోయాడు.
Also Read
- Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
- Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
- Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
- Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
సీసీకెమెరాలో రికార్డైన నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. నిందితుడి ఆచూకీ తెలియజేసే వారికి పోలీసులు రివార్డ్ కూడా ప్రకటించారు. ఇదిలా ఉంటే ఈ ఏడాదిలో ఇప్పటివరకూ ఐదుగురు భారతీయులు మరణించారు. తాజాగా మరొకరు చనిపోవడంతో ఎన్నారైల్లో కలవరం రేగుతోంది.
DC Police just released this video of a person of interest in the case of a man assaulted outside Shoto Restaurant on 15th Street NW on Friday at 2am.
41-year-old Vivek Taneja of Alexandria was seriously injured. He passed away Wednesday. pic.twitter.com/DgwLyQms8y
— Spencer Allan Brooks (@SpencerSays) February 9, 2024
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!