NTV Telugu Site icon

Canada: భారతీయుడి హత్య.. దర్యాప్తులో తేలిందిదే!

Dkek

Dkek

కెనడాలో నివసిస్తున్న ఇండియన్‌ యువరాజ్‌ గోయల్‌ (28) హత్యకు గురయ్యాడు. కొందరు దుండగులు ఆయనపై కాల్పులు జరపడంతో ప్రాణాలు కోల్పోయాడు. జూన్ 7న ఈ ఘటన జరిగినట్లు జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. అయితే ఇది పక్కాప్లాన్‌తో ఈ ఘటన జరిగినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు.

ఇది కూడా చదవండి: Amol Kale: ముంబై క్రికెట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు హఠాన్మరణం

యువరాజ్‌ గోయల్‌ పంజాబ్‌లోని లుథియానా ప్రాంతం. ఉన్నత చదువులు నిమిత్తం 2019లో గోయల్‌ కెనడా వెళ్లాడు. ప్రస్తుతం సేల్స్‌ ఎగ్జిక్యూటివ్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. ఇటీవల కెనడాలో శాశ్వత నివాస హోదా కూడా లభించింది. ఈ క్రమంలోనే శుక్రవారం బ్రిటిష్‌ కొలంబియాలోని సర్రే ప్రాంతంలో కాల్పులు జరిగినట్లు పోలీసులకు సమాచారం అందింది. వారు అక్కడికి చేరుకొని యువరాజ్‌ మృతదేహాన్ని గుర్తించారు. ఈ ఘటనలో నలుగురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. మృతుడికి ఎలాంటి నేర చరిత్ర లేదని వెల్లడించారు. మృతదేహాన్ని పోస్టుమార్గానికి తరలించారు. అయితే ఈ ఘటన పక్కా ప్రణాళికతో కాల్పులకు పాల్పడినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. దర్యాప్తు కొనసాగుతోంది.

ఇది కూడా చదవండి: Austrian airlines: గగనతలంలో భారీ వడగండ్లు.. దెబ్బతిన్న విమానం ముక్కు

జూన్ 7న ఉదయం 8:46 గంటలకు 164 స్ట్రీట్‌లోని 900 బ్లాక్‌లో ఈ ఘటన జరిగింది. గోయల్ తండ్రి రాజేష్ గోయల్ కట్టెల వ్యాపారం చేస్తుంటాడు. తల్లి శకున్ గోయల్ గృహిణి. ఈ హత్యకు సంబంధించి నలుగురు అనుమానితుల్ని అదుపులోకి తీసుకున్నారు. మన్వీర్ బస్రామ్ (23), సాహిబ్ బస్రా (20), హర్కీరత్ జుట్టి (23), అంటారియోకు కైలాన్ ఫ్రాంకోయిస్ (20)గా గుర్తించారు. ఒక లక్ష్యంతోనే చంపినట్లుగా పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది.

ఇది కూడా చదవండి: Kalki 2898 AD Trailer : గూజ్ బంప్స్ తెప్పిస్తున్న కల్కి ట్రైలర్.. చూశారా?