Site icon NTV Telugu

Kerala: కేరళలో కూలిన ఇండియన్ నేవీ హెలికాప్టర్.. ఓ అధికారి మృతి

New Project 2023 11 05t073747.039

New Project 2023 11 05t073747.039

Kerala: కేరళలోని కొచ్చిలో శనివారం (నవంబర్ 4) ఐఎన్‌ఎస్ గరుడపై మెయింటెనెన్స్ ట్యాక్సీ తనిఖీలో భారత నావికాదళానికి చెందిన చేతక్ హెలికాప్టర్ కూలిపోయింది. ఈ ప్రమాదంలో నేవీకి చెందిన గ్రౌండ్‌ సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. నావికుడు మృతి పట్ల నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్ హరి కుమార్, సీడీఎస్ అనిల్ చౌహాన్ సంతాపం తెలిపారు. ప్రమాదానికి గల కారణాలను పరిశోధించడానికి విచారణ బోర్డును ఆదేశించినట్లు భారత నౌకాదళం తెలిపింది. నేవీ వర్గాల సమాచారం ప్రకారం.. నేవల్ ఎయిర్ స్టేషన్ ఐఎన్ఎస్ గరుడ రన్‌వేపై హెలికాప్టర్ టేకాఫ్ అయిన వెంటనే ప్రమాదానికి గురైంది.

Read Also:Gold Price Today: గుడ్ న్యూస్.. ఈరోజు కాస్త ఊరట ఇస్తున్న ధరలు.. తులం ఎంతంటే?

Read Also:Producer Arrested: మహిళా జర్నలిస్టుతో అసభ్య ప్రవర్తన.. సినీ నిర్మాత అరెస్ట్

అధికారులు తెలిపిన వివరాల ప్రకారం యోగేంద్ర సింగ్ అనే నావికుడు మరణించాడు. యోగేంద్ర మధ్యప్రదేశ్ నివాసి. “కొచ్చిలోని ఐఎన్ఎస్ గరుడ వద్ద నిర్వహణ తనిఖీల సమయంలో చేతక్ హెలికాప్టర్ ఈరోజు కూలిపోయింది, ఫలితంగా నావికాదళ సిబ్బంది మరణించారు” అని నేవీ క్లుప్త ప్రకటనలో తెలిపింది. నేవల్ చీఫ్ అడ్మిరల్ ఆర్ హరి కుమార్, ఇండియన్ నేవీ సిబ్బంది అందరూ యోగేంద్ర సింగ్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసి ఆయనకు నివాళులర్పించినట్లు నేవీ తెలిపింది. సీడీఎస్ జనరల్ అనిల్ చౌహాన్ కూడా నావికుడు మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లో హెడ్‌క్వార్టర్స్ ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్ హ్యాండిల్ నుండి ఒక పోస్ట్ మృతుల కుటుంబాలకు మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాము. మేము మీకు అండగా ఉంటామన్నారు.

Exit mobile version