Ajit Doval: జేమ్స్ బాండ్.. హాలీవుడ్ సినిమాలు చూసే వారికి పరిచయం అవసరం లేని పేరు. ఈ జేమ్స్ బాండ్ పాత్రకు ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. అచ్చం ఇలాంటిదే ఓ పాత్ర రియల్ లైఫ్‌లో కూడా ఉంది. నిజం అండీ బాబు. అది మరెక్కడో కాదు.. మన దేశంలోనే. ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం.. ఇంతకీ ఆ జేమ్స్ బాండ్ ఎవరని ఆలోచిస్తున్నారా? వాస్తవంగా దేశ ప్రజలందరికీ ఆయనో రియల్ సూపర్ హీరో. అంతగా అభిమానిస్తారు ఈ దేశ ప్రజలు ఆయన్ని. తన ప్రాణాలకు ఎంతో రిస్క్ ఉన్నా సరే పాక్‌లో ఆరేళ్లు రహస్యంగా ఉండి విలువైన సమాచారాన్ని దేశానికి అందించారు. ఇంతకీ ఈ రియల్ సూర్ హీరో ఎవరూ, ఆయన దేశానికి చేసిన సేవ ఎంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం..
READ ALSO: Chiranjeevi: అదిగో పులి అంటే ఇదిగో తోక అంటారేంటి?
‘అజిత్ దోవల్- ఆన్ ఎ మిషన్’
డి దేవదత్ రాసిన ‘అజిత్ దోవల్- ఆన్ ఎ మిషన్’ పుస్తకం బయటికి వచ్చిన తర్వాత అప్పటి వరకు దేశ ప్రజలకు హీరోగా ఉన్న ఓ వ్యక్తి ఆ తర్వాత సూపర్ హీరో అయిపోయారు. ఆయన మరేవరో కాదు.. ఇండియన్ జేమ్స్ బాండ్ అని దేశ ప్రజలు ముద్దుగా పిలుచుకునే జాతీయ భద్రతా సలహాదారు(NSA) అజిత్ దోవల్. ఆయన తన జీవితంలో అనేక ఇంపాజిబుల్ అనే మిషన్స్‌లో పాల్గొని ప్రాణాలకు తెగించి పని చేశారు. అలాంటి ఎన్నో మిషన్స్ గురించి దేవదత్ రాసిన పుస్తకంలో ఉన్నాయి.
అది 1974 లో భారతదేశం తన మొదటి అణు పరీక్షను నిర్వహించిన సమయం.. భారత్ చర్యతో ప్రపంచంతో పాటు పాకిస్థాన్ షాక్ అయ్యాయి. తర్వాత పాక్, చైనా – ఉత్తర కొరియా మద్దతుతో అణు సామర్థ్యాలను అన్వేషించడం ప్రారంభించింది. దీంతో ఇండియా ఈ రహస్యాన్ని తెలుసుకోడానికి ఒకరిని నియమించింది. ఆయనే ఇండియాన్ సూపర్‌కాప్ అని పిలువబడే అజిత్ దోవల్. ఇండియా ఈ మిషన్‌ను ఆయనకు అప్పగించింది. ఈ మిషన్ నిజంగా ఆయన ప్రాణాలకు ఎంతో ప్రమాదం ఉన్న మిషన్, పొరపాటున ఎక్కడైన నిజం బయటపడితే, ఆయన ప్రాణాలతో పాటు దేశ భద్రత కూడా ప్రమాదంలో పడుతుంది. మొత్తానికి ఆయన ఏం చేశారనేది తెలుసుకుందాం..
పాక్ వీధుల్లో బిచ్చగాడిగా మారి..
‘అజిత్ దోవల్- ఆన్ ఎ మిషన్’ పుస్తకం ప్రకారం.. దోవల్ పాకిస్థాన్‌లోని కహుటా వీధుల్లో చాలా రోజులు బిచ్చగాడి వేషంలో తిరిగారు. ఆ దారిన వెళ్లేవాళ్లు ఆయన్ను నిజమైన భిక్షగాడు అనుకొని కొన్నిసార్లు దానం కూడా చేసేవాళ్లు. కానీ ఆయన వీటన్నింటి ఎప్పుడు పట్టించుకునే వారు కాదు. ఆయన ధ్యాస ఎప్పుడు ఆయన మిషన్ మీదే ఉండేది. అక్కడి పరిస్థితులను అనుక్షణం నిశితంగా గమనిస్తూ ఉండే వారు. అకస్మాత్తుగా ఒక రోజు ఆయన దృష్టి ఒక చిన్న క్షౌరశాల వైపు మళ్లింది. అక్కడికి ఖాన్ రీసెర్చ్ సెంటర్ శాస్త్రవేత్తలు రోజూ వచ్చేవారు. దోవల్ ఇతర బిచ్చగాళ్లలాగే బయట కూర్చున్నాడు, కానీ ఆయన దృష్టి మొత్తం లోపల నేలపై చెల్లాచెదురుగా పడిఉన్న జుట్టుపైనే ఉంది. సమయం చూసుకొని ఆయన నిశ్శబ్దంగా వెంట్రుకలను సేకరించి భారతదేశానికి పంపించారు. ఈ వెంట్రుకలను పరీక్షించినప్పుడు రేడియేషన్, యురేనియం జాడలు బయటపడ్డాయి. ఇది పాకిస్థాన్ రహస్య అణు కార్యక్రమం గురించి సమాచారాన్ని అందించింది. ఈ ఒక్క అడుగుతో ఆయన పాక్ అణు ఆశయాల రూపురేఖలను ప్రపంచం ముందు బట్టబయలు చేశారు.
6 ఏళ్లు రహస్య జీవితం..
పాకిస్థాన్‌లో దోవల్ ఆరు ఏళ్లు రహస్యంగా నివసించారు. ఎప్పుడు, ఎవరు, ఎలా, ఎక్కడ చంపేది తెలియని పరిస్థితుల్లో ఆయన తన మిషన్ కోసం ప్రమాదం అంచున నిలబడి పోరాడాడు. పాక్‌లో ఆయన సేకరించిన సమాచారం భారత నిఘా సంస్థలకు ఆ దేశం అణ్వస్త్ర ఆశయాల పరిధి గురించి కీలకమైన సమాచారాన్ని అందించాయి. ఆ వెంట్రుకలను సేకరించి యురేనియం ఉనికిని నిరూపించడం ద్వారా, పాకిస్థాన్ అణు పరీక్షలు నిర్వహించే సామర్థ్యాన్ని దాదాపు 15 సంవత్సరాలు ఆలస్యం చేసిన సమాచారాన్ని ఆయన అందించాడని పుస్తకం పేర్కొంది. ఈ మిషన్ దోవల్ అత్యంత సాహసోపేతమైన, తెలివైన నిఘా కార్యకలాపాలలో ఒకటిగా చెప్తారు.
READ ALSO: J&K Cyber Security Move: జమ్మూకశ్మీర్ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. అక్కడ ఈ సేవలు బంద్
