Site icon NTV Telugu

Delhi : లండన్ లోని భారత హైకమిషన్ ఆఫీస్ పై ఖలిస్థాన్ అనుకూలవాదుల దాడి

Kalisthan

Kalisthan

లండన్ లో ఖలిస్థాన్ అనుకూలవాదులు భారత హై కమిషన్ బిల్డింగ్ పై ఉన్న జాతీయ జెండాను కిందికి దించారు. అలా జెండాను అగౌర పరచడంతో భారత్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఢిల్లీలోని బ్రిటన్ సీనియర్ దౌత్యవేత్తకు ఈ మేరకు భారత్ సమన్లు జారీ చేసింది. ఖలిస్థాన్ వేర్పాటువాదులు లండన్ లో చేసిన పనిని మన దేశం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లుగా తెలిపింది. అక్కడి ప్రభుత్వం బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. వారిస్ పంజాబ్ దే నాయకుడు ఖలిస్థాన్ సానుభూతిపరుడు అమృత్ పాల్ సింగ్ అనుచరులను రెండు రోజుల క్రితం పంజాబ్ పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో పంజాబ్ లో రెండు రోజులుగా తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి.

Also Read : Salman Khan: సల్మాన్ ఖాన్‌కి మరోసారి బెదిరింపులు.. అదే లక్ష్యమంటూ ఈ-మెయిల్

ఈ నేపథ్యంలోనే ఆదివారం సాయంత్రం లండన్ లో ప్రవాస సిక్కుల్లోని ఓ వర్గం నిరసనలు ప్రారంభించింది. లండన్ లో ఉన్న భారత హై కమిషన్ భవనంపై ఏర్పాటు చేసిన జెండాను కిందికి దించుతున్నట్లుగా సోషల్ మీడియాలో వీడియోలు పోస్ట్ చేసింది. దీనిమీద భారత విదేశాంగ శాఖ తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఖలిస్థానీ నిరసనకారులు హై కమిషన్ వచ్చేంత వరకు.. అక్కడ ఇలాంటి చర్యకు పాల్పడతుంటే అక్కడి భద్రత సిబ్బంది ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఏం చేస్తున్నారని ప్రశ్నించింది.

Also Read : Kakani Govardhan Reddy: ఇవే చంద్రబాబుకు ఆఖరి విజయోత్సవాలు.. 2024 ఎన్నికలే టీడీపీకి చివరివి..!

ఈ చర్య మీద వెంటనే కూలంకషంగా వివరణ ఇవ్వాలని భారత్ బ్రిటన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. భారత హై కమిషన్ కు భద్రత కల్పించడం యూకే ప్రభుత్వ ప్రాథమిక బాధ్యత అని.. ఇది వియాన్నా ఒప్పందం ప్రకారం ఉన్న విషయమని భారత విదేశాంగ శాఖ గుర్తు చేసింది. లండన్ లోని భారత దౌత్య కార్యాలయ ప్రాంగణం.. అక్కడున్న భారత సిబ్బంది భద్రత మీద యూకే ప్రభుత్వం ఇలా ఉదాసీనత చూపించడం.. ఏమాత్రం
ఆమోదయోగ్యం కాదని భారత్ పేర్కొంంది.

Exit mobile version