NTV Telugu Site icon

US Canada Border : సరిహద్దు దాటుతూ భారతీయ కుటుంబం దుర్మరణం

Us Canada Border

Us Canada Border

కెనడా-అమెరికా సరిహద్దులో విషాదం చోటు చేసుకుంది. అక్రమంగా సరిహద్దు దాటే క్రమంలో ఆరుగురు శరణార్థులు దుర్మరణం పాలయ్యారు. వీళ్లలో ఐదుగురు భారత్ కు చెందిన వాళ్లూ.. అదీ ఒకే కుటుంబానికి చెందిన వాళ్లుగా గుర్తించారు. మరో వ్యక్తిని కెనడా పౌరసత్వం ఉన్న రోమేనియాన్ గా కెనడా పోలుసులు గుర్తించారు. ఇరుదేశాల మధ్య అక్వెసాస్నేలోని మోహవ్క్ సరిహద్దు-క్యూబెక్ (న్యూయర్క్ స్టేట్ ) ప్రాంతంలో సెయింట్ లారెన్స్ నదిలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. మృతులు అంతా భారతీయులేనా అనేది.. ఇంకా నిర్థాకరణ కావాల్సి ఉందని అధికారులు అన్నారు.

Also Read : Ganja gang: మైలార్ దేవుపల్లిలో గాంజా గ్యాంగ్ వీరంగం.. కత్తులు, రాళ్లతో దాడి

మృతుల్లో మూడేళ్ల చిన్నారి కూడా ఉన్నట్లు సమాచారం. గురువానరం నదీ తీర ప్రాంతంలో ప్రమాదానికి గురైన ఓ బోటును అధికారులు గుర్తించారు. ఆపై ఏరియల్ సర్వే ద్వారా మృతదేహాలు ఒక్కొక్కటిగా వెలికితీశారు. మరొ చిన్నారికి చెందిన పాస్ పోర్ట్ లభ్యం కాగా ఆమె కూడా చనిపోయి ఉన్నట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు. మృతదేహం కోసం గాలింపు చేపట్టారు. ఇది హృదయవిధారకమైన ఘటన.. మృతుల్లో పసికందులు కూడా ఉండడం ఘోరం అని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో స్పందించారు.

Also Read : Man Infected By Killer Plant : మొక్కల నుంచి మానవునికి వ్యాధులు

ఇక జనవరి నుంచి ఇప్పటి దాకా అక్రమంగా ఇరు దేశాల్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన ఘటనలు 48 వెలుగు చూసినట్లు అక్వెసాస్నే అధికారులు చెబుతున్నారు. వీళ్లలో భారత్ కు, రొమేనియాకు చెందిన వాళ్లే ఎక్కువగా ఉన్నట్లు చెప్పున్నారు. మోహవ్క్ సరిహద్దు ప్రాంతంలో ఉండే అక్వెసాస్నే.. క్యూబెక్, ఒంటారియో, న్యూయార్క్ స్టేట్ లతో సరిహద్దు పంచుకుంటుంది. అందుకే వీటి గుండా ఇరు దేశాలకు శరణార్థుల అక్రమ రవాణా ఎక్కువగా ఉంటోంది. పైగా ఈ అక్రమ రవాణాకు పోలీసులే సహకరిస్తుండడం గమనార్హం. సరిహద్దుల్లో దిగాక.. వాళ్లకు గోప్యంగా వాహనాల్లో ఆయా ప్రాంతాలకు తరలిస్తుంటారు.

Show comments