Indian Curries in TasteAtlas Top 50: ఇండియన్ ఫుడ్ అంటేనే నోరూరిపోయే రుచులు. వేడి వేడి అన్నంలో పప్పు తడ్కా, కాల్చిన నాన్‌తో షాహీ పన్నీర్, లేదా సండే లంచ్‌లో గుమగుమలాడే రోగన్ జోష్ ఇలా ఏది తిన్నా మనసు తృప్తిగా ఉంటుంది. అయితే, మన ఇండియన్ వంటకాలకు ఇప్పుడు గ్లోబల్ లెవెల్లో మరో గుర్తింపు దక్కింది. ప్రపంచవ్యాప్తంగా విభిన్న సంస్కృతులు, సాంప్రదాయ వంటకాల విశేషాలను సేకరించి రేటింగ్‌లు ఇస్తోంది ప్రముఖ అంతర్జాతీయ ఫుడ్ అండ్ ట్రావెల్ గైడ్ సంస్థ ‘టేస్ట్ అట్లాస్(TasteAtlas)’. ఇటీవల ప్రపంచంలోని టాప్ 50 టేస్టీ కూరల జాబితాను ఈ సంస్థ విడుదల చేసింది. “ప్రపంచంలోని అత్యుత్తమ కూరలు” (50 Best Stews in the World) జాబితాలో మన దేశం నుంచి ఏకంగా ఎనిమిది వంటకాలు చోటు సంపాదించుకున్నాయి. ఇందులో మన ముర్ఘ్ మఖనీ ఏకంగా 4వ స్థానంలో నిలిచి అందరి దృష్టిని ఆకర్షించింది.
ఈ గ్లోబల్ రేంకింగ్లో టాపర్‌గా నిలిచింది మాత్రం పెరూ దేశానికి చెందిన ‘సెకో దె కబ్రిటో’ (seco de cabrito). ఇది ఉత్తర పెరూలో చాలా ఫేమస్. లేత మేక మాంసాన్ని ‘చిచా దె జోరా’ (chicha de jora) అనే పానీయంలో నానబెట్టి, కొత్తిమీర ఎక్కువగా ఉండే సాస్‌లో ఉడికించి దీన్ని తయారు చేస్తారు. దీని తర్వాత థాయ్‌లాండ్‌కు చెందిన ‘పనాంగ్ కర్రీ’ రెండో స్థానంలో, టర్కీకి చెందిన ‘హుంకర్ బెయేంది’ మూడో స్థానంలో నిలిచాయి. ఇక మన మర్గ్ మఖానీ 4.4 రేటింగ్‌తో 4వ స్థానంలో నిలిచింది. రెస్టారెంట్లలో ఎప్పుడూ ఉండే ఈ డిష్‌కు గ్లోబల్ లెవెల్లో ఈ స్థాయి గుర్తింపు దక్కడం విశేషం.
మన దేశం నుంచి ఈ జాబితాలో మొదటి స్థానంలో నిలిచిన మర్గ్ మఖానీ (Butter Chicken) 4.4 రేటింగ్‌తో 4వ స్థానాన్ని దక్కించుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ వంటకాల మధ్య జరిగిన ఈ పోటీలో ఇండియన్ ఎంట్రీలలో ఇదే అత్యుత్తమ స్థానంలో నిలవడం మనందరికీ గర్వకారణం. రెస్టారెంట్ మెనూల్లో ఎప్పటికీ స్పెషల్‌గా ఉండే ఈ వంటకం ఇప్పుడు ప్రపంచ వేదికపై మరోసారి మెరిసింది. పన్నీర్ ప్రియులందరూ ఖచ్చితంగా సంతోషించదగ్గ విషయం ఏంటంటే.. షాహీ పన్నీర్ 4.3 రేటింగ్‌తో 6వ స్థానాన్ని కైవసం చేసుకుంది. మన దేశం నుంచి అత్యధిక స్థానం దక్కించుకున్న రెండో వంటకం ఇదే కావడం విశేషం. అంతేకాదు, ఈ జాబితాలో టాప్-6 స్థానాల్లోనే మన దేశానికి చెందిన రెండు ఫేవరెట్ రెస్టారెంట్ వంటకాలు ఉండటం గమనార్హం.
ఇక కీమా విషయానికి వస్తే, ఇది 4.3 రేటింగ్‌తో 23వ స్థానంలో నిలిచింది. చిన్నగా తరిగిన మాంసంతో చేసే ఈ వంటకం, అంతర్జాతీయ వంటకాలతో పోటీ పడుతూ ఈ జాబితాలో మొదటి సగభాగంలో చోటు దక్కించుకుంది. దీని తర్వాత సాగ్ పన్నీర్ 4.2 రేటింగ్‌తో 31వ స్థానంలో నిలిచింది. షాహీ పన్నీర్ తర్వాత పన్నీర్‌తో చేసిన మరో వంటకం ఈ లిస్ట్‌లో చోటు దక్కించుకోవడం ద్వారా, మన దేశం నుంచి వెజిటేరియన్ ఐటమ్స్ జాబితా మరింత బలపడింది. ఇక మన ప్రతిరోజూ తినే ఇళ్లలోని కంఫర్ట్ ఫుడ్ ‘పప్పు తడ్కా’ (Dal Tadka) 4.2 రేటింగ్‌తో 35వ స్థానంలో నిలిచింది. ఎలాంటి స్పెషల్ అక్షాజాలు, ఖరీదైన రెస్టారెంట్ రిజర్వేషన్లు అవసరం లేకుండా, మన ఇంట్లోనే ఎప్పుడూ చేసుకునే ఈ సాధారణ పప్పు కూడా గ్లోబల్ రేంకింగ్లో తన సత్తా చాటింది.
బెంగాల్ ప్రత్యేకతను చాటుతూ ‘చింగ్రి మలై కర్రీ’ (Chingri Malai Curry) 4.2 రేటింగ్‌తో 38వ స్థానాన్ని దక్కించుకుంది. పన్నీర్, పప్పులతో పాటు సీఫుడ్ కూడా మన ఇండియన్ లిస్ట్‌లో ఉందని ఈ వంటకం రుజువు చేసింది. ఇక కశ్మీర్ స్పెషల్ అయిన రోగన్ జోష్ (Rogan Josh) 4.2 రేటింగ్‌తో 48వ స్థానంలో నిలిచింది. ఈ లిస్ట్ చివర్లో కనిపించినా, మన దేశం నుంచి మరో ప్రాంతీయ వంటకం గ్లోబల్ స్టేజ్‌పై నిలవడానికి ఇది కారణమైంది. చివరిగా, మన ఇండియన్ లైనప్‌ను పూర్తి చేస్తూ ‘మద్రాస్ కర్రీ’ 4.2 రేటింగ్‌తో 49వ స్థానంలో నిలిచింది. ఈ జాబితాలో చివరి డిష్‌కు కేవలం ఒక్క స్థానం ముందు నిలవడం ద్వారా, మొత్తంగా 50 వంటకాల ఈ గ్లోబల్ జాబితాలో భారత్ తన ప్రయాణాన్ని ఘనంగా ముగించింది.

