NTV Telugu Site icon

Axar Patel Marriage: మేహా పటేల్‌ను మనువాడిన భారత క్రికెటర్ అక్షర్ పటేల్

Axar Patel

Axar Patel

Axar Patel Marriage: భారత క్రికెటర్లు వరుసగా పెళ్లి పీటలెక్కుతున్నారు. ఇటీవల స్టార్ ఓపెనర్ కేఎల్ రాహుల్‌ అతియా శెట్టిచో కలిసి వివాహ బంధంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. తాజాగా మరో స్టార్‌ క్రికెటర్‌ ఓ ఇంటివాడయ్యాడు. భారత క్రికెటర్ అక్షర్ పటేల్ గురువారం గుజరాత్‌లోని వడోదర వేదికగా మేహా పటేల్‌ను వివాహం చేసుకున్నారు. స్పిన్‌ బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌లోనూ అదరగొడుతున్న అక్షర్.. తన ప్రేయసి మహా పటేల్‌తో కలిసి ఏడడుగులు నడిచాడు. వధూవరుల కుటుంబసభ్యులు, సన్నిహితులు, స్నేహితులు ఈ వేడుకకు హాజరై వారి వివాహ వేడుకను తిలకించారు.

అలాగే జయదవ్‌ ఉనాద్కత్‌ తదితర టీమిండియా క్రికెటర్లు వివాహా వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. అంతకు ముందు ప్రీ వెడ్డింగ్‌ కార్యక్రమాలైన సంగీత్‌, మెహందీ ఈవెంట్లు కూడా గ్రాండ్‌గా జరిగాయి. సంగీత్‌ సందర్భంగా అక్షర్‌– మేహా దంపతులు కలిసి సరదాగా డ్యాన్స్‌ చేశారు. ఆల్ రౌండర్ తన పెళ్లి కారణంగా ఈసారి న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌కు దూరమయ్యాడు. ప్రస్తుతం ఈ వెడ్డింగ్‌ ఈవెంట్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి.

Australian Open Final: కెరీర్‌ చివరి టోర్నీలో సానియాకు షాక్.. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో ఓటమి

అక్షర్‌ పటేల్‌ చాలా కాలంగా మేహాతో ప్రేమలో ఉన్నాడు. గతేడాది తన పుట్టినరోజు (జనవరి 20) సందర్భంగా మేహాకు రొమాంటిక్‌గా ప్రపోజ్ చేశాడు. అనంతరం తమ ప్రేమ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ ఇద్దరి ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు. ఇర మేహా విషయానికొస్తే వృత్తి రీత్యా డైటీషియన్ అలాగే న్యూట్రిషనిస్ట్‌. ఈక్రమంలో అక్షర్‌ డైట్ విషయంలో ఆమె జాగ్రత్తలు తీసుకుంటోంది.