Site icon NTV Telugu

Indian Army Group C Recruitment 2025: 10th అర్హతతో.. ఇండియన్ ఆర్మీలో గ్రూప్ సి పోస్టులు.. ఇప్పుడే అప్లై చేసుకోండి..

Indian Army

Indian Army

ఇండియన్ ఆర్మీలో కెరీర్ స్టార్ట్ చేయాలనుకునే వారికి గోల్డెన్ ఛాన్స్. పదో తరగతి పూర్తి చేసుకుని ఖాళీగా ఉన్నవారు ఈ ఛాన్స్ ను అస్సలు మిస్ చేసుకోకండి. ఇండియన్ ఆర్మీ గ్రూప్ సి పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తులు ఆఫ్‌లైన్‌లో స్వీకరిస్తారు. ఇండియన్ ఆర్మీ మొత్తం 194 గ్రూప్ సి పోస్టులను భర్తీ చేయనుంది. దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్ 4, 2025న ప్రారంభమైంది. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ అక్టోబర్ 24, 2025.

Also Read:Team India: వన్డే వరల్డ్‌ కప్‌లో రోహిత్- కోహ్లీని ఆడించకపోవడం మంచిది కాదు..

గ్రూప్ సి ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి, అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10వ తరగతి, 12వ తరగతి లేదా ITI ఉత్తీర్ణులై ఉండాలి. వారు ఇతర నిర్దేశించిన అర్హత ప్రమాణాలను కూడా కలిగి ఉండాలి. అలాగే, అభ్యర్థుల ఎత్తు 165 సెం.మీ., ఛాతీ 81.5 సెం.మీ., బరువు 50 కిలోలు ఉండాలి. దరఖాస్తు చేసుకోవడానికి కనీస వయస్సు 18 సంవత్సరాలు, గరిష్ట వయస్సు 25 సంవత్సరాలు. అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు కూడా ఉంది. SC, ST అభ్యర్థులకు 5 సంవత్సరాల వయోపరిమితిలో సడలింపు, OBC అభ్యర్థులకు 3 సంవత్సరాల వయోపరిమితిలో సడలింపు, వికలాంగ అభ్యర్థులకు 10 సంవత్సరాల వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

Exit mobile version