NTV Telugu Site icon

Indian Army Recruitment 2023 : ఇండియన్ ఆర్మీలో భారీగా ఉద్యోగాలు..అర్హతలు ఇవే..

Jobs

Jobs

ఇండియన్ ఆర్మీలో ఉద్యోగం చెయ్యాలని అనుకొనేవారికి అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది కేంద్ర ప్రభుత్వం.. తాజాగా ఆర్మీకి సంబందించిన నోటిఫికేషన్ ను విడుదల చేశారు.. బీటెక్ చదువుతోపాటుగా ఆర్మీలో లెఫ్టినెంట్ కొలువు సొంతం చేసుకునే అవకాశం దక్కించుకోవాలనుకునే వారికి మంచి అవకాశం..2024 జులైలో ప్రారంభం కానున్న 10+2 టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ 51వ బ్యాచ్ ఎంపిక ప్రక్రియ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 90 ఖాళీలను భర్తీ చెయ్యనున్నారు.. ఈ ఉద్యోగాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

అర్హతలు..

జేఈఈ మెయిన్ 2023లో ర్యాంకు సాధించిన అభ్యర్ధులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమేటిక్స్ సబ్జెక్టుల్లో 60 శాతం మార్కులతో ఇంటర్ పాసై ఉండాలి.. పెళ్లి కానీ వాళ్లే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది..

వయోపరిమితి..

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల వయసు 16 1/2 సంవత్సరాల నుండి 19 1/2 మధ్య ఉండాలి..

ఎంపిక విధానం..

షార్ట్ లిస్ట్ అయిన వారిని సెలెక్ట్ చేస్తారు..ఇందులో ఎంపికైన అభ్యర్ధులను సర్వీస్ సెలక్షన్ బోర్డు అధ్వర్యంలో బెంగుళూరులో అయిదు రోజుల పాటు రెండు దశల్లో సైకలాజికల్ పరీక్షలు, గ్రూప్ టెస్టులు, ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.తొలిరోజు స్టేజ్ 1 స్క్రీనింగ్ పరీక్షలో అర్హత సాధించిన వారిని స్టేజ్ 2కు ఎంపిక చేస్తారు. నాలుగు రోజుల పాటు సాగే వివిధ పరీక్షలలో అన్ని విభాగాల్లో అభ్యర్ధులు రాణించాల్సి ఉంటుంది.. వారిని ఎంపిక చేస్తారు..

జీతం..

ప్రతి నెల రూ.56,100తో పాటు మిలటరీ సర్వీస్‌ పే కింద రూ.15,500 చెల్లిస్తారు. వీటికి అదనంగా డీఏ, హెచ్‌ఆర్‌ఎ, ఇతర ప్రోత్సాహకాలు ఇస్తారు..అభ్యర్ధులు దరఖాస్తులను ఆన్‌లైన్‌ ద్వారా పంపాల్సి ఉంటుంది. దరఖాస్తులకు చివరి తేదీ నవంబర్‌ 12, 2023 గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https : // www.joinindianarmy.nic.in/ సందర్శించగలరు..