NTV Telugu Site icon

Indian Army: ఆర్మీలో చేరడం మీ కలా? టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ కు వెంటనే అప్లై చేసుకోండి.. ఇంటర్ పాసైతే చాలు!

Army

Army

ఇండియన్ ఆర్మీలో చేరాలని యువత కలలుకంటుంటారు. మీకు కూడా ఆర్మీలో చేరాలని ఉందా? అయితే ఇదే మంచి ఛాన్స్. ఇంటర్ పాసైతే చాలు ఆర్మీలో జాబ్ సొంతం చేసుకోవచ్చు. భారత సైన్యం టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ (TES-54) కింద యువత కోసం నియామక ప్రక్రియను ప్రారంభించింది. ఈ నియామకం ద్వారా అర్హత కలిగిన అభ్యర్థులు కమిషన్డ్ ఆఫీసర్ కావడానికి సువర్ణావకాశం పొందుతారు.

Also Read:Shashi Tharoor: కాంగ్రెస్‌కు తలనొప్పిగా మారిన శశిథరూర్! వేటుపై తర్జనభర్జనలు

12వ తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు. వారు ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ (PCM) సబ్జెక్టులతో 12వ తరగతి ఉత్తీర్ణులై JEE (మెయిన్) 2025లో పరీక్షకు హాజరైన వారు మాత్రమే అర్హులు. ఈ నియామక ప్రక్రియలో ఎంపికైన అభ్యర్థులు భారత సైన్యం నుంచి స్పాన్సర్‌షిప్‌పై ఇంజనీరింగ్ డిగ్రీ పొందే అవకాశం ఉంటుంది. అంటే, శిక్షణ సమయంలోనే వారికి హై క్వాలిటీ గల సాంకేతిక విద్యను అందిస్తారు.

Also Read:IPL 2025: దడ పుట్టిస్తున్న ప్లేఆఫ్స్ లెక్కలు.. ఒకటే పోస్ట్.. 3 జట్లు పోటీ

ఎంపిక ప్రక్రియ

అభ్యర్థుల ఎంపిక వివిధ దశల్లో జరుగుతుంది. మొదటగా, JEE (మెయిన్) 2025 స్కోరు ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేస్తారు. దీని తరువాత షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులను SSB ఇంటర్వ్యూకు పిలుస్తారు. ఇంటర్వ్యూలో విజయం సాధించిన అభ్యర్థులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. తుది ఎంపిక తర్వాత, అభ్యర్థులకు NDA వంటి కఠినమైన శిక్షణ ఇవ్వబడుతుంది. ఆ తర్వాత వారికి భారత సైన్యంలో శాశ్వత కమిషన్ మంజూరు చేస్తారు.

Also Read:IPL 2025: చితక్కొట్టిన GT ఓపెనర్లు.. 3 జట్లకు ప్లేఆఫ్స్ బెర్త్ క‌న్ఫార్మ్

అర్హత, వయోపరిమితి

అభ్యర్థులు 12వ తరగతి ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ సబ్జెక్టులతో ఉత్తీర్ణులై ఉండటం తప్పనిసరి. దీనితో పాటు, అభ్యర్థి JEE (మెయిన్) 2025లో హాజరై ఉండాలి. అభ్యర్థుల వయస్సు 16 సంవత్సరాల 6 నెలల నుంచి 19 సంవత్సరాల 6 నెలల మధ్య ఉండాలి. అంటే 2 జూలై 2006 నుంచి 1 జూలై 2009 మధ్య జన్మించిన అభ్యర్థులు అర్హులు.

Also Read:GVMC Deputy Mayor: పోరాడి డిప్యూటీ మేయర్‌ సాధించిన జనసేన.. కూటమిలో కొత్త వివాదం..!

ఈ నియామకానికి దరఖాస్తు ప్రక్రియ మే 13, 2025 నుచి ప్రారంభమైంది. చివరి తేదీ జూన్ 12, 2025. ఆసక్తిగల అభ్యర్థులు ఇండియన్ ఆర్మీ అధికారిక వెబ్‌సైట్ [joinindianarmy.nic.in](https://joinindianarmy.nic.in) ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. మీరు కొత్త యూజర్ అయితే ముందుగా రిజిస్టర్ చేసుకోవాలి. దరఖాస్తు ఫారమ్ ఫిల్ చేసేటపుడు 12వ తరగతి మార్కుల షీట్, పాస్‌పోర్ట్ సైజు ఫోటో వంటి అవసరమైన అన్ని పత్రాలను అప్‌లోడ్ చేయాలి. ఫారమ్ సబ్ మిట్ చేసిన తర్వాత నిర్ధారణ పేజీ ప్రింటవుట్ తీసుకోవడం మర్చిపోవద్దు.