Site icon NTV Telugu

ATOR N1200 Amphibious Vehicles: ఇండియన్ ఆర్మీ సూపర్ వెహికిల్స్.. వరదల్లోనూ రయ్ రయ్..

Ator N1200 Amphibious Vehic

Ator N1200 Amphibious Vehic

ATOR N1200 Amphibious Vehicles: ఇండియన్ ఆర్మీ సూపర్ వెహికిల్స్‌ను చూశారా! అత్యవసర సమయంలో, ఆపద వేళల్లో ప్రజలకు సేవలందించేందుకు ఎల్లవేళలా ముందు ఉండేది ఇండియన్ ఆర్మీ. తాజాగా పంజాబ్‌లోని వరద ప్రభావిత గ్రామాల్లో చిక్కుకున్న ప్రజలను రక్షించడానికి సైన్యం కొత్తగా ప్రవేశపెట్టిన ATOR N1200 యాంఫిబియస్ వాహనాన్ని మోహరించింది. ఈ వాహనం ప్రత్యేకతలు ఏంటంటే లోతైన నీరు, కఠినమైన భూభాగం గుండా వెళ్లేలా దీనిని తయారు చేశారు. రాష్ట్రంలోని భారీ వర్షాలు ముంచెత్తడంతో అమృత్‌సర్‌లో ఈ ఆర్మీ వాహనం సేవలోకి వచ్చింది.

READ ALSO: Siricilla : లింగన్నపేట తండాలో చిక్కుకుపోయిన వారిని బయటికి తీసుకొచ్చిన SDRF

వరద సహాయక చర్యల్లో సైన్యం..
వరదల కారణంగా దెబ్బతిన్న ప్రాంతాలకు చేరుకోవడానికి సైన్యం, NDRF బృందాలకు ఈ అధునాతన వాహనం ఎంతో సహాయం చేస్తోంది. భారీ వరదల్లో చిక్కుకున్న గ్రామస్థులను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి ఈ వాహనం ఎంతో ఉపయోగడుతోందని అధికారులు అంటున్నారు. గురుదాస్‌పూర్‌లో పాఠశాల భవనంలోకి వరద నీరు ప్రవేశించడంతో జవహర్ నవోదయ విద్యాలయానికి చెందిన దాదాపు 400 మంది విద్యార్థులు, సిబ్బంది వరదల్లో చిక్కుకున్నారు. ఈ వాహనాల ద్వారా వారిని సురక్షిత ప్రాంతాలకు ఆర్మీ అధికారులు తరలించారు. పంజాబ్ అంతటా ఆగస్టు 30 వరకు పాఠశాలలను మూసివేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

ATOR N1200 స్పెషల్..
UKకి చెందిన కోపాటో భాగస్వామ్యంతో JSW గెక్కో మోటార్స్ నిర్మించిన ATOR N1200, SHERP N1200 వాహనానికి భారతీయ వెర్షన్. ఈ వాహనం తీవ్రమైన ఆఫ్ – రోడ్, లోతైన నీటి కదలికల మధ్య, సైనిక, విపత్తు సహాయక ఉపయోగం కోసం రూపొందించారు. రక్షణ మంత్రిత్వ శాఖ 2024లో ఇటువంటి 96 వాహనాలకు రూ.250 కోట్లతో ఆర్డర్ ఇచ్చింది. ఛండీగఢ్లోని ఒక ప్రాంతంలో వీటి ఉత్పత్తి జరుగుతోంది. గత సంవత్సరం గెక్కో మోటార్స్‌ను కొనుగోలు చేసిన JSW డిఫెన్స్, కోపాటోతో జాయింట్ వెంచర్ కింద భారతదేశంలో ఈ వాహనాలను ఉత్పత్తి చేస్తోంది.

READ ALSO: Silver Hallmarking: వెండి బంగారం కాను..! హాల్ మార్కింగ్‌తో వెండి ధరలకు రెక్కలు

Exit mobile version