Site icon NTV Telugu

Indian Airforce: భారత వైమానిక దళానికి కొత్త యూనిఫాం.. తొలిసారిగా ఢిల్లీ వెలుపల రైజింగ్ డే..

Indian Airforce

Indian Airforce

Indian Airforce: భారత వైమానిక దళానికి కొత్త యూనిఫాం అందుబాటులోకి వచ్చింది. శనివారం చంఢీగడ్‌లో జరిగిన 90వ భారత వైమానిక దళ వార్షికోత్సవాల్లో ఈ యూనిఫాంను ఎయిర్‌ చీఫ్ వివేక్‌ రామ్ చౌదరి ఆవిష్కరించారు. ఇంతకు ముందు ఉన్న యూనిఫాం కంటే ఇప్పుడు మరింత డిఫరెంట్‌గా ఉంది. కాగా ప్రతీసారి భారత వైమానిక దళ వార్షికోత్సవాలు దేశ రాజధాని ఢిల్లీలో జరపడం తెలిసిన విషయమే. కానీ ఈ సారి రాజధాని ఆవల చంఢీగడ్‌లో నిర్వహించారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎలాంటి వాతావరణంలోనైనా సైనికులు తట్టుకుని నిలబడేలా చేయడం ఈ యూనిఫాం ప్రత్యేకత. ఈ యూనిఫాంను ఎయిర్ ఫోర్స్ స్టాండింగ్ డ్రెస్ కమిటీ, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (నిఫ్ట్‌) సంయుక్తంగా రూపొందించాయి.

భారత వైమానిక దళంలో పనిచేస్తున్న సైనికుల కోసం ప్రభుత్వం శనివారం కొత్త యూనిఫాంను విడుదల చేసింది. ఈ కొత్త యూనిఫాం సైన్యం యూనిఫారాన్ని పోలి ఉంటుంది. వైమానిక దళం థీమ్ ఈసారి ‘ట్రాన్స్‌ఫార్మింగ్ ఫర్ ద ఫ్యూచర్’ అని తయారుచేశారు. ఈ యూనిఫాం అత్యంత సౌకర్యవంతంగా ఉంటుంది. 90వ భారత వైమానిక దళ వార్షికోత్సవ సందర్భంగా.. ఇది చ‌రిత్రాత్మక‌మైన సంద‌ర్భమ‌ని, వైమానిక ద‌ళంలో ఆఫీస‌ర్ల రిక్రూట్మెంట్ కోసం వెప‌న్ సిస్టమ్ బ్రాంచ్ ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదం తెలిపిన‌ట్లు ఐఏఎఫ్ చీఫ్ వివేక్‌ రామ్ చౌదరి వెల్లడించారు. స్వాతంత్య్రం వ‌చ్చిన త‌ర్వాత ఐఏఎఫ్‌లో ఆప‌రేష‌న్ బ్రాంచ్‌ను క్రియేట్ చేయ‌డం ఇదే తొలిసారి అని ఆయ‌న అన్నారు. వెప‌న్ సిస్టమ్ శాఖ వ‌ల్ల ఫ్లయింగ్ శిక్షణ కోసం అయ్యే ఖ‌ర్చుల్లో సుమారు 3400 కోట్లను ఆదా చేయ‌వ‌చ్చు అని చౌద‌రీ తెలిపారు.

TDP Flag: మౌంట్ ఎవరెస్ట్ పై టీడీపీ జెండా ఎగరేసిన 80ఏళ్ల వృద్ధుడు

భారత రక్షణ రంగానికి చెందిన త్రివిధ దళాల్లో ఒకటైన వైమానిక దళం బ్రిటీష్ కాలంలో 1932 అక్టోబర్‌ 8న ఏర్పడింది. రెండో ప్రపంచ యుద్ధంలో బ్రిటన్‌ తరఫున పాల్గొని పోరాటం చేసింది. స్వాతంత్ర్యం లభించిన అనంతరం భారత వైమానిక దళంగా మారింది. మొత్తం 1.70 లక్షల మంది సిబ్బంది, 1300పైగా యుద్ధ విమానాలతో ప్రపంచంలోనే నాలుగో పెద్ద వైమానిక దళంగా గుర్తింపు పొందింది. మొత్తం ఐదు ఆపరేషనల్ కమాండింగ్ కేంద్రాలు.. 1,130 కంబాట్.. 1,700 నాన్- కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్‌లు వైమానిక దళం వద్ద ఉన్నాయి.

Exit mobile version