Nikhil Gupta : అమెరికాలో ఖలిస్తాన్ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్యకు కుట్ర పన్నిన నిందితుడు నిఖిల్ గుప్తాను చెక్ రిపబ్లిక్ అప్పగించింది. నిఖిల్ గుప్తాను అమెరికాకు పంపారు. అమెరికా పరిపాలన అభ్యర్థన మేరకు నిఖిల్ గుప్తాను గతేడాది జూన్‌లో అరెస్టు చేశారు. ఖలిస్థాన్ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్యకు కుట్ర పన్నినట్లు ఆరోపణలు వచ్చాయి. సోమవారం న్యూయార్క్ ఫెడరల్ కోర్టులో నిఖిల్ గుప్తాను హాజరుపరిచే అవకాశం ఉంది. ప్రస్తుతం అతన్ని బ్రూక్లిన్‌లోని మెట్రోపాలిటన్ డిటెన్షన్ సెంటర్‌లో ఉంచారు. అమెరికాలో ఉంటూనే పన్ను భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుండే వాడు. అతను తరచుగా హిందువులను బెదిరించేవాడు. పన్నూ హత్యకు భారత అధికారులతో కలిసి గుప్తా కుట్ర పన్నాడని యుఎస్ ఫెడరల్ ప్రాసిక్యూషన్ పేర్కొంది. దీని తర్వాత గుప్తాను ప్రేగ్‌లో అరెస్టు చేశారు.
Read Also:Delhi Water Crisis: పైప్ లైన్లను ధ్వంసం చేస్తున్నారని మంత్రి అతిషి ఆరోపణలు..(వీడియో)
నిఖిల్ గుప్తా చెక్ రిపబ్లిక్‌లో అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్ తిరస్కరణకు గురైంది. పన్నూని హత్య చేయడానికి గుప్తా ఒక హిట్‌మ్యాన్‌ని నియమించడానికి ప్రయత్నించాడని అమెరికా ప్రభుత్వం చెబుతోంది. పన్నుకు అమెరికా, కెనడా ద్వంద్వ పౌరసత్వం ఉంది. యూఏపీఏ కింద అతడిని ఉగ్రవాదిగా భారత్ ప్రకటించింది. 23 నవంబర్ 2023న, నిఖిల్ గుప్తాను అప్పగించడాన్ని ప్రేగ్ హైకోర్టు ఆమోదించింది. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా గుప్తా రాజ్యాంగ ధర్మాసనంలో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్‌ను కూడా తిరస్కరించారు. అమెరికా అందించిన ఆధారాలు, పత్రాలను పరిశీలించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కోర్టు తెలిపింది. 80 లక్షల నగదు ఇస్తానని నిఖిల్ గుప్తా హామీ ఇచ్చినట్లు ఆరోపణలు వచ్చాయి. గుప్తాకు భారత అధికారి నుంచి సూచనలు అందుతున్నాయని కూడా ఆరోపణలు వచ్చాయి. అయితే ఏ అధికారి పేరు చెప్పలేదు.
Read Also:Rain Alert: మరో మూడు రోజులు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..