NTV Telugu Site icon

Indian 2 OTT Rites : భారీ మొత్తానికి కొనుగోలు చేసిన ప్రముఖ ఓటీటీ సంస్థ..?

Whatsapp Image 2023 07 24 At 9.57.57 Pm

Whatsapp Image 2023 07 24 At 9.57.57 Pm

విశ్వ నటుడు కమల్ హాసన్ మరియు తమిళ్ స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న లేటెస్ట్ మూవీ ఇండియన్ 2. దాదాపు 26 ఏళ్ల కిందట కమల్, శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన భారతీయుడు మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే..ఇప్పుడు భారతీయుడు సినిమాకు సీక్వల్ గా తెరకెక్కుతుంది ఇండియన్ 2 మూవీ.ఈ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలకు తగినట్లుగానే ఈ సినిమా ఓటీటీ హక్కులను భారీ మొత్తానికి ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ కొనుగోలు చేసినట్లు సోషల్ మీడియాలో ఒక వార్త బాగా వైరల్ అవుతుంది.ఇండియన్ 2 మూవీ డిజిటల్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సంస్థ ఏకంగా రూ.200 కోట్లకుపైగా చెల్లించి దక్కించుకున్నట్లు సమాచారం.అన్ని భాషల హక్కులూ ఈ ఓటీటీకే దక్కినట్లు సమాచారం. అయితే ఈ విషయం పై నెట్‌ఫ్లిక్స్ గానీ ఇండియన్ 2 మూవీ మేకర్స్ గానీ అధికారికంగా ప్రకటించలేదు.

ఈ సినిమా షూటింగ్ ఈ మధ్యే పూర్తయింది.ప్రస్తుతం డైరెక్టర్ శంకర్ ఈ సినిమాకు సంబంధించి వీఎఫ్ఎక్స్ వర్క్ కోసం అమెరికాకు వెళ్లారు.అక్కడ లోలా వీఎఫ్ఎక్స్ కంపెనీ ఈ మూవీకి సంబంధించి గ్రాఫిక్స్ వర్క్ చేస్తుంది.. లోలా విఎఫ్ఎక్స్ సంస్థ అవెంజర్స్ ఎండ్ గేమ్ వంటి హాలీవుడ్ మూవీకి వీఎఫ్ఎక్స్ అందించిన సంస్థ అని సమాచారం.దీంతో ఇండియన్ 2 గ్రాఫిక్స్ ఓ లెవల్లో ఉండబోతుందని చెప్పొచ్చు.టెక్నాలజీ సాయంతో కమల్ హాసన్ ను యంగ్ ఏజ్ లో ఎలా ఉన్నాడో అలా ఈ సినిమాలో మళ్లీ చూపించబోతున్నారు. 1996లో వచ్చిన భారతీయుడు సినిమాలోనే కమల్ హాసన్ మేకప్ చూసి అందరూ ఎంతో ఆశ్చర్యపోయారు. అప్పట్లోనే వయసు మళ్లిన వాడిగా కమల్ ను చూపించిన తీరు ప్రేక్షకులను ఎంతో ఆశ్చర్యానికి గురి చేసింది. ఇప్పుడు టెక్నాలజీ బాగా మెరుగుపడింది. మరీ ఇండియన్ 2 ఏ స్థాయిలో ఉంటుందో చూడాలి.ఈ ఇండియన్ 2 మూవీలో కమల్ హాసన్ తోపాటు కాజల్, రకుల్ ప్రీత్, సిద్ధార్థ్ వంటి స్టార్స్ నటిస్తున్నారు.ఈ సినిమాకు యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ రవిచందర్ మ్యూజిక్ అందిస్తున్నాడు. లైకా ప్రొడక్షన్స్, రెడ్ జెయింట్ మూవీస్ సంయుక్తంగా ఇండియన్ 2 మూవీని భారీగా నిర్మిస్తున్నాయి.

Show comments