NTV Telugu Site icon

Kamal ‘Indian2: విశ్వ నటుడికి విషెష్‎తో ఇండియన్ 2పోస్టర్ రిలీజ్.. స్టైల్ మామూలుగా లేదు

Kamal Hasan

Kamal Hasan

Kamal ‘Indian2’: విశ్వనటుడు, లోక నాయకుడు కమల్ హాసన్ తన 68వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఆయన బర్త్ డే సందర్భంగా అభిమానులు సెలబ్రేషన్స్ మొదలు పెట్టారు. తాజాగా ఆయన పుట్టిన రోజును పురస్కరించుకుని ఇండియన్-2నుంచి పోస్టర్ రిలీజ్ చేసింది చిత్రబృందం. ఈ సందర్భంగా తమ హీరోకు దర్శకుడు శంకర్ శుభాకాంక్షలు తెలిపారు. ఇండియన్-2 సినిమాలో కమల్‌ హాసన్‌కి జంటగా కాజల్ అగర్వాల్ నటిస్తోంది. కమల్, శంకర్ కాంబినేషన్‌లో ఇప్పటికే వచ్చిన ‘ఇండియన్’ మూవీ విడుదలైన అన్ని భాషల్లోనూ బ్లాక్‌ బాస్టర్‌ హిట్‌గా నిలిచింది. తెలుగులో ‘భారతీయుడు’గా ఈ సినిమాని అప్పట్లో విడుదల చేశారు.

 

Also Read :Twitter : ట్విటర్ తీసేసింది.. ఇప్పుడు మెటా మొదలు పెట్టింది

ఇటీవల విడుదలైన ‘విక్రమ్’ మూవీ కమల్ హాసన్‌కి విజయోత్సాహాన్ని అందించింది. ఈ సినిమాలో సరికొత్త మేనరిజంతో కమల్ మైమరించాడు. దాంతో అభిమానుల్లో ఇండియన్-2 పై అంచనాలు పెంచేసుకున్నారు. తాజాగా ఈ సినిమా గురించి ఓ అప్డేట్ బయటకు వచ్చింది. భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ తండ్రి యోగ్ రాజ్ సింగ్ ఇండియన్-2 సినిమాలో విలన్‌గా నటించబోతున్నట్లు ప్రకటించింది టీం. పంజాబ్‌లో నటుడిగా మంచి పేరు సంపాదించుకున్న యోగ్ రాజ్‌ సింగ్ ఇలా పాన్ ఇండియా మూవీలో కనిపించడం ఇదే తొలిసారి. ఈ మేరకు మేకప్ వేసుకుంటున్న ఓ ఫొటోని యోగ్ రాజ్ సింగ్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు.

Show comments