Site icon NTV Telugu

Indian 2: ఆయన నమ్మకమే ‘భారతీయుడు 2’.. కమల్ హాసన్ కీలక వ్యాఖ్యలు..

Indian2

Indian2

సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ శంక‌ర్, యూనివ‌ర్స‌ల్ స్టార్ క‌మ‌ల్ హాస‌న్‌, కాంబినేష‌న్‌లో లైకా ప్రొడ‌క్ష‌న్స్, ప్రముఖ నిర్మాణ సంస్థ రెడ్ జెయింట్ బ్యానర్‌పై సుభాస్క‌ర‌న్ నిర్మించిన భారీ బ‌డ్జెట్ చిత్రం ‘భార‌తీయుడు 2’. జూలై 12న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో గ్రాండ్ లెవ‌ల్లో రిలీజ్ కానుంది. జూన్ 1న శనివారం నాడు చెన్నైలో సినీ ప్రముఖులు సమక్షంలో ఆడియో వేడుక‌ను ఘ‌నంగా నిర్వ‌హించిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రంలో హీరో శింబు, డైరెక్టర్ లోకేష్ కనకరాజ్, నెల్సన్, నిర్మాత AM రత్నం, ఏసియన్ సినిమాస్ సునీల్ నారంగ్, భరత్ నారంగ్ వంటి పలుగురు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ ఈవెంట్ లో శృతి హాసన్, మౌనీ రాయ్, శంకర్ కూతరు అదితీ శంకర్, కొడుకు అర్జిత్ శంకర్ లైవ్ పర్ఫామెన్స్‌లు అందరినీ ఆకట్టుకున్నాయి.

INDRANI: మాస్ మార్వెల్ గా అలరించనున్న ‘ఇంద్రాణి’..

ఇక ఈ ఈవెంట్‌ లో యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ మాట్లాడుతూ.. 28 ఏళ్ల క్రితం ఇండియన్ సినిమా టైంలో నేను శివాజీ గణేశన్ తో ఓ సినిమా చేయాలిని., ఆ టైంలోనే డైరెక్టర్ శంకర్ ఇండియన్ కథతో వచ్చారని చెబుతూ.. రెండు కథలు కొంచెం దగ్గరదగ్గరగా ఉన్నాయని తెలిపాడు. ఇక ఈ విషయాన్ని శివాజీ గణేశన్ గారితో చెప్పగా.. ఆయన శంకర్ తోనే సినిమా చేయండి.. ఆయన ఇదివరకు ఓ సినిమాను తీశారని చెప్పినట్లు తెలిపారు. దాంతో ఆయన అన్న ఒక్క మాటతో, అదే నమ్మకంతో తాను శంకర్ తో ఇండియన్ సినిమా చేశానని చెప్పుకొచ్చాడు. అప్పటలోనే నేను శంకర్ తో సీక్వెల్ గురించి మాట్లాడాను. కానీ., దానికి మాత్రం కథ రెడీగా లేదనాట్లు తెలిపారు. మళ్లీ ఇప్పుడు అంటే 28 ఏళ్ల తరువాత ఇండియన్ 2 చేశామని తెలిపాడు.

Nandamuri Vasundhara: నందమూరి వసుంధర చేతుల మీదుగా మెర్సిడెస్ బెంజ్ కార్ గెలుచుకుంది ఎవరంటే..?

ఇకపోతే ఈ ప్రాజెక్ట్ ఇంతదూరం వచ్చిందంటే లైకా అధినేత సుభాస్కరన్ కారణమని తెలిపాడు కమల్. సినిమాకు ఎన్ని సవాళ్లు ఎదురైనా మాకు అండగా నిలిచారని., చివరకు సినిమాను ఇక్కడి వరకు తీసుకొచ్చారని తెలిపారు. ఆయన తమపై పెట్టిన నమ్మకమే ఈ సినిమాని., ఆయన నమ్మకానికి తగ్గట్టుగానే సినిమాను చేశామని తెలిపాడు.

Exit mobile version