Site icon NTV Telugu

IND vs AUS 5th T20: వర్షం కారణంగా రద్దైన ఐదో T20 మ్యాచ్.. సిరీస్ భారత్ కైవసం

India

India

భారత్- ఆస్ట్రేలియాల మధ్య 5T20 సిరీస్‌ జరిగుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా నేడు T20 సిరీస్‌లోని ఐదవ, చివరి మ్యాచ్ (నవంబర్ 8) బ్రిస్బేన్‌లోని గబ్బాలో జరిగింది. ఈ మ్యాచ్ లో ముందుగా టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బౌలింగ్ ఎంచుకుంది. భారత్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. భారత్ ఆట ప్రారంభించిన కాసేపటికే వర్షం అంతరాయం కలిగించింది. వర్షం కారణంగా మ్యాచ్ డ్రా అయింది. భారీ వర్షం, మెరుపులతో ఆటకు అంతరాయం కలిగే ముందు భారతదేశం వికెట్ నష్టపోకుండా 52 పరుగులు చేసింది. మ్యాచ్ రద్దు కావడంతో, భారత్ ఆస్ట్రేలియాతో జరిగిన T20 సిరీస్‌ను 2-1తో గెలుచుకుంది.

Also Read:Komatireddy Venakt Reddy : తెలంగాణ రాష్ట్ర చరిత్రలో కనీవిని ఎరగని స్థాయిలో రోడ్ల నిర్మాణం

టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న తర్వాత, భారత్‌కు శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మ అద్భుతమైన ఆరంభం ఇచ్చారు. ఇద్దరూ కలిసి అర్ధ సెంచరీ భాగస్వామ్యాన్ని పంచుకున్నారు. రెండు జట్ల మధ్య జరిగిన కాన్‌బెర్రా టీ20 మ్యాచ్ కూడా వర్షం కారణంగా రద్దయింది. ఆ తర్వాత ఆస్ట్రేలియా మెల్‌బోర్న్ టీ20 మ్యాచ్‌ను 4 వికెట్ల తేడాతో గెలుచుకుంది. ఆ తర్వాత భారత జట్టు హోబర్ట్ (5 వికెట్లు), గోల్డ్ కోస్ట్ (48 పరుగులు) టీ20 మ్యాచ్‌లలో కంగారూలను ఓడించి విజయం సాధించింది.

Exit mobile version