Site icon NTV Telugu

IND vs ENG: ఇంగ్లాండ్‌కు చేరిన భారత మహిళల క్రికెట్ జట్టు.. మ్యాచుల షెడ్యూల్ ఇలా..

Ind Vs Eng

Ind Vs Eng

IND vs ENG: శుభ్‌మన్ గిల్ నేతృత్వంలో భారత పురుషుల జట్టు ఇంగ్లాండ్‌తో టెస్ట్ సిరీస్ కోసం సన్నద్ధమవుతున్నప్పుడే, మరోవైపు భారత మహిళల క్రికెట్ జట్టు కూడా ఇంగ్లాండ్ గడ్డపై అడుగుపెట్టింది. ముంబయి నుంచి బయలుదేరిన మహిళల జట్టు ఇంగ్లాండ్‌తో ఐదు టీ20లు, మూడు వన్డే మ్యాచులు ఆడనుంది. ఈ పర్యటన జూలై 28న మొదలవుతుంది. ఈ సిరీస్ భారత మహిళల జట్టుకు ఎంతో కీలకమైనది. ఎందుకంటే, సెప్టెంబర్‌లో జరగబోయే మహిళల వన్డే వరల్డ్‌కప్ ముందు, ఇంగ్లాండ్‌ ను వారి గడ్డపై ఓడించడం జట్టుకు బలమైన ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. అలాగే, ప్లేయింగ్ ఎలెవెన్ ఎంపికలో కూడా స్పష్టత కలిగే అవకాశముంది. ఇంగ్లాండ్‌ను వారి సొంత గడ్డపై ఓడించడం సులభం కాదన్న విషయం తెలిసిందే. అందుకే ఈ సిరీస్ భారత్‌కు ఓ సవాలుగా మారనుంది. హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్ గా, స్మృతి మంధాన వైస్ కెప్టెన్ గా జట్టు ఇంగ్లాండ్ తో పోరుకు సిద్ధం కానుంది.

Read Also: UP: పెళ్లయిన 50 రోజులకే ప్రియుడితో జంప్.. లస్సీలో మత్తు మందు కలిపి..

టీ20, వన్డే మ్యాచ్‌ల షెడ్యూల్ ఇలా ఉంది.
టీ20 సిరీస్ షెడ్యూల్:

జూన్ 28: నాటింగ్‌హామ్

జూలై 1: బ్రిస్టల్

జూలై 4: లండన్ (ఓవల్)

జూలై 9: మాంచెస్టర్

జూలై 12: బర్మింగ్‌హామ్

వన్డే సిరీస్ షెడ్యూల్:

జూలై 16: సౌతాంప్టన్

జూలై 19: లార్డ్స్

జూలై 22: చెస్టర్-లీ-స్ట్రీట్

Read Also: Rashmika : ‘రష్మిక సెంటిమెంట్’ కుబేరకు కలిసొస్తుందా..?

భారత టీమ్స్ వివరాలు:
భారత టీ20 జట్టు:
హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (ఉప కెప్టెన్), షెఫాలీ వర్మ, జెమిమా రోడ్రిగ్స్, ఋచా ఘోష్ (వికెట్ కీపర్), యాస్తికా భాటియా (వికెట్ కీపర్), హర్లీన్ దియోల్, దీప్తి శర్మ, స్నేహ్ రాణా, శ్రీ చారాణి, శుచీ ఉపాధ్యాయ్, అమన్జోత్ కౌర్, అరుందతి రెడ్డి, క్రాంతి గౌడ్, సాయిలి సతఘరే

భారత వన్డే జట్టు:
హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (ఉప కెప్టెన్), ప్రతికా రావళ్, హర్లీన్ దియోల్, జెమిమా రోడ్రిగ్స్, ఋచా ఘోష్ (వికెట్ కీపర్), యాస్తికా భాటియా (వికెట్ కీపర్), తేజల్ హస్బనిస్, దీప్తి శర్మ, స్నేహ్ రాణా, శ్రీ చారాణి, శుచీ ఉపాధ్యాయ్, అమన్జోత్ కౌర్, అరుందతి రెడ్డి, క్రాంతి గౌడ్, సాయిలి సతఘరే

Exit mobile version