Hockey Asia Cup 2025: హాకీ ఆసియా కప్ విజేతగా భారత్ నిలిచింది. ఫైనల్‌లో దక్షిణ కొరియాను 4-1 తేడాతో ఓడించి భారత పురుషుల హాకీ జట్టు ఆసియా కప్ టైటిల్‌ను గెలుచుకుంది. భారత్ నాలుగోసారి ఆసియా కప్ ట్రోఫీని గెలుచుకుంది. ఖండాంతర టోర్నమెంట్‌ను గెలుచుకోవడంతో భారత జట్టు వచ్చే ఏడాది బెల్జియం, నెదర్లాండ్స్ సంయుక్తంగా నిర్వహించనున్న ప్రపంచ కప్‌కు అర్హత సాధించింది. రాజ్‌గిర్‌లో జరిగిన ఫైనల్‌లో సుఖ్‌జీత్, దిల్‌ప్రీత్, అమిత్ భారత్ తరఫున గోల్స్ సాధించారు. 30వ సెకనులో సుఖ్జీత్ సింగ్ తొలి గోల్ చేశాడు. రెండవ క్వార్టర్‌లో దిల్‌ప్రీత్ ఒక గోల్ చేశాడు. 45వ నిమిషంలో దిల్‌ప్రీత్ సింగ్ మళ్ళీ గోల్ చేశాడు. 50వ నిమిషంలో అమిత్ గోల్ చేసి భారత్ ఆధిక్యాన్ని బలోపేతం చేశాడు. 51వ నిమిషంలో కొరియా మ్యాచ్‌లో తొలి గోల్ చేసింది.
READ MORE: Nightmares: చెడ్డ, పీడ కలలతో బాధపడుతున్నారా? ఇది కూడా ఓ కారణం కావచ్చు..!
ఆసియా కప్‌లో భారత్ టీం మంచి ప్రదర్శన ఇచ్చింది. హర్మన్‌ప్రీత్ సింగ్ నాయకత్వంలో ఆ జట్టు చైనాను 4-3, జపాన్‌ను 3-2, కజకిస్తాన్‌ను 15-0 తేడాతో ఓడించింది. సూపర్-4లో కూడా జట్టు ఆధిపత్యం కొనసాగింది. మొదటి మ్యాచ్ కొరియాతో 2-2తో డ్రాగా ముగిసింది. రెండవ మ్యాచ్‌లో ఆ జట్టు మలేషియాను 4-1తో ఓడించింది. చివరి సూపర్-4 మ్యాచ్‌లో భారత్ చైనాను 7-0తో ఓడించింది. ఫైనల్‌లో దక్షిణ కొరియాను 4-1తో ఓడించి భారత్ టైటిల్‌ను గెలుచుకుంది.
