Gold Medals: ఆసియా క్రీడల్లో భారత్‌కు గోల్డ్ రష్.. ఆర్చరీ, షూటింగ్లో అదరగొట్టిన భారత అథ్లెట్లు.! ఒకేరోజు నాలుగు స్వర్ణాలు కైవసం..
- ఆసియా క్రీడలు 2026
- భారత్‌కు ఒకేరోజు 4 స్వర్ణ పతకాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gold Medals: ఆయిచి-నగోయా ఆసియా క్రీడలు 2026లో భారత్‌కు బుధవారం స్వర్ణ పతకాల పంట పండింది. ఒకేరోజు ఆర్చరీలో రెండు, షూటింగ్లో ఒక స్వర్ణం కలిపి భారత్ ఖాతాలో మూడు బంగారు పతకాలు చేరాయి. మహిళల కాంపౌండ్ టీమ్, కాంపౌండ్ మిక్స్డ్ టీమ్, ట్రాప్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లలో భారత జోడీలు, బృందాలు అద్భుత ప్రదర్శన చేశాయి.
ఆర్చరీలో ప్రపంచ రికార్డు స్కోరుతో స్వర్ణం
మహిళల కాంపౌండ్ టీమ్ విభాగంలో జ్యోతి సురేఖ వెన్నం, పృథికా ప్రదీప్, చికితా తనిపర్తి చైనాపై 238-234 తేడాతో విజయం సాధించి స్వర్ణ పతకం గెలిచారు. దీంతో హాంగ్జౌ 2023లో సాధించిన టైటిల్‌ను భారత్ నిలబెట్టుకుంది.
Also Read
- Kapil Dev: రిటైర్మెంట్ వెనక్కి తీసుకో.. ఇంకో రెండుమూడేళ్లు ఆడొచ్చు.. కోహ్లీకి కపిల్ దేవ్ కీలక సూచనలు
- Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
- Palla Srinivasa Rao: స్థానిక ఎన్నికలపై పల్లా శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు.. మాకు అవే ముఖ్యం..!
- Veeramachineni Ramakrishna: వీరమాచినేని రామకృష్ణపై క్రిమినల్ కేసు నమోదు..
మొదటి అర్ధభాగం ముగిసే సమయానికి భారత్ 119-116తో ఆధిక్యంలో ఉంది. రెండో అర్ధభాగంలోనూ చైనా నుంచి తీవ్ర పోటీ ఎదురైనా భారత ఆర్చర్లు ఆధిక్యాన్ని కాపాడుకుని విజయం సాధించారు. భారత జట్టు సాధించిన 238 పాయింట్లు మహిళల కాంపౌండ్ టీమ్ విభాగంలో ప్రపంచ రికార్డును సమం చేశాయి. 2014 ఇంచియాన్ ఆసియా క్రీడల్లో దక్షిణ కొరియా నెలకొల్పిన రికార్డును భారత్ సమం చేసింది. జ్యోతి సురేఖ మాత్రమే హాంగ్జౌలో స్వర్ణం సాధించిన భారత జట్టులోనూ సభ్యురాలిగా ఉన్నారు. ఫైనల్లో జ్యోతి, పృథికా ఒక్క బాణాన్ని కూడా లక్ష్యానికి దూరంగా వేయకుండా అద్భుత ప్రదర్శన చేశారు. ఈ స్వర్ణంతో ఆయిచి-నగోయా ఆసియా క్రీడల్లో భారత్ పతకాల సంఖ్యలో ఏడో స్వర్ణం చేరింది.
THE GOLD WINNING TEAM INDIA 🥇🥹
– Beats China 🇨🇳 238-234 in the Finals
– Equals World Record of 238 🔥The trio of Prithika, Chikitha & Jyothi 🇮🇳
ASIAN GAMES CHAMPION IN THE WOMEN’S COMPOUND TEAM! 🏆🤩 pic.twitter.com/19hbd7dRHT
— The Khel India (@TheKhelIndia) September 30, 2026
మిక్స్డ్ టీమ్‌లో కొరియాపై థ్రిల్లింగ్ విజయం
కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో చికితా తనిపర్తి, సాహిల్ జాదవ్ జోడీ దక్షిణ కొరియాను షూట్‌ఆఫ్‌లో ఓడించి స్వర్ణ పతకం సాధించింది. ఈ విజయంతో భారత్ హాంగ్జౌ 2023లో గెలిచిన మిక్స్డ్ టీమ్ టైటిల్‌ను కూడా నిలబెట్టుకుంది.
ఫైనల్లో భారత్ తొలి అర్ధభాగం ముగిసేసరికి 80-78తో ఆధిక్యంలో ఉంది. అయితే రెండో భాగంలో దక్షిణ కొరియా పుంజుకుని స్కోరును 157-157తో సమం చేసింది. దీంతో విజేతను నిర్ణయించేందుకు షూట్‌ఆఫ్ నిర్వహించారు. షూట్‌ఆఫ్‌లో చికితా, సాహిల్ ఇద్దరూ 10 పాయింట్లను కొట్టగా.. దక్షిణ కొరియా చివరి బాణం 9 పాయింట్ల వద్ద ఆగింది. దీంతో భారత్ స్వర్ణాన్ని సొంతం చేసుకుంది. ఈ విజయం భారత్‌కు మరో కీలక ప్రయోజనాన్ని కూడా అందించింది. 2028 లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్‌లో కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్ తొలిసారి ప్రవేశించనున్న నేపథ్యంలో భారత్‌కు ఒలింపిక్ కోటా స్థానం లభించింది.
THIS IS HUGE RESULT FOLKS!!!! 🤩🥹
Sahil & Chikitha wins the Compound Team Gold & earns LA 2028 Quota for India 🇮🇳🥇
🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥 pic.twitter.com/fWP5r0UxDH
— The Khel India (@TheKhelIndia) September 30, 2026
షూటింగ్‌లోనూ భారత్‌కు గోల్డ్
ట్రాప్ మిక్స్డ్ టీమ్ విభాగంలో నీరూ ధండా, కైనన్ చెనాయ్ జోడీ కూడా స్వర్ణ పతకం సాధించింది. ఫైనల్లో 34 పాయింట్లు సాధించిన భారత జోడీ కొత్త ఆసియా రికార్డును నెలకొల్పింది. ఖతార్ 32 పాయింట్లతో రజతం, చైనా 23 పాయింట్లతో కాంస్యం గెలుచుకున్నాయి. మొదటి సిరీస్‌లో 10 టార్గెట్లకు గాను భారత్ ఆరు మాత్రమే కొట్టింది. దీంతో భారత జోడీ పతకాల రేసులో చివరి స్థానంలో నిలిచింది. అయితే ఆ తర్వాత ఒక్క టార్గెట్‌ను కూడా మిస్ కాకుండా అద్భుతంగా పుంజుకుని.. చివరకు ఒక్క పాయింట్ ఆధిక్యంతో స్వర్ణం సాధించింది.
ఈ ఆసియా క్రీడల్లో నీరూ ధండాకు ఇది రెండో స్వర్ణం, మొత్తంగా మూడో పతకం. మహిళల ట్రాప్ వ్యక్తిగత విభాగంలో ఆమె స్వర్ణం, ట్రాప్ టీమ్ ఈవెంట్లో రజతం గెలిచారు. కైనన్ చెనాయ్కు కూడా ఇది ఆసియా క్రీడల్లో మూడో పతకం. హాంగ్జౌ 2023లో అతడు రెండు పతకాలు సాధించాడు. దీనితో ప్రస్తుతం భారత్ ఖాతాలో 9 బంగారు పతకాలు చేరాయి.
India wins 3rd GOLD in Asian Games 2026 today!!!
From Skeet Mixed doubles!
Second gold for Neeru!
What a day !!! pic.twitter.com/r6MXCt0rwU
— XUnfiltered (@XUnfiltere69061) September 30, 2026
80/80 పర్ఫెక్ట్ స్కోరుతో..
ఆయిచి-నగోయా ఆసియా క్రీడలు 2026లో 12వ రోజు భారత్‌కు స్వర్ణ పతకాల వర్షం కురిసింది. ఆర్చరీ, షూటింగ్లో భారత అథ్లెట్లు అదరగొడుతున్నారు. మహిళల, మిక్స్డ్ కాంపౌండ్ టీమ్ ఈవెంట్లలో స్వర్ణాలు సాధించిన అనంతరం.. పురుషుల కాంపౌండ్ టీమ్ కూడా చైనాను ఓడించి బంగారు పతకం సొంతం చేసుకుంది. పురుషుల కాంపౌండ్ టీమ్ ఫైనల్లో భారత ఆర్చర్లు అద్భుత ప్రదర్శన చేశారు. భారత జట్టులోని ఓ ఆర్చర్ 80/80 పర్ఫెక్ట్ స్కోర్ సాధించి జట్టు స్వర్ణం గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. చైనాను వెనక్కి నెట్టి భారత్ గోల్డ్ మెడల్ దక్కించుకుంది.
ఈ విజయంతో ఆయిచి-నగోయా ఆసియా క్రీడల్లో భారత్ పతకాల సంఖ్య మరింత పెరిగింది. ప్రస్తుతం భారత్ 10 స్వర్ణాలు, 21 రజతాలు, 27 కాంస్యాలతో మొత్తం 58 పతకాలు సాధించి మెడల్ టేబుల్లో 7వ స్థానానికి చేరుకుంది.
INDIAN MEN’S COMPOUND TEAM WIN THE GOLD MEDAL AT ASIAN GAMES 2026! 🥇
– Defeated China 🇨🇳 238-237 in Finals
3/3 GOLD FOR INDIAN COMPOUND ARCHERY!
🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥 pic.twitter.com/gSgig6sLi2
— The Khel India (@TheKhelIndia) September 30, 2026
తాజావార్తలు
-
Gold Medals: ఆసియా క్రీడల్లో భారత్‌కు గోల్డ్ రష్.. ఆర్చరీ, షూటింగ్లో అదరగొట్టిన భారత అథ్లెట్లు.! ఒకేరోజు నాలుగు స్వర్ణాలు కైవసం..
-
Kapil Dev: రిటైర్మెంట్ వెనక్కి తీసుకో.. ఇంకో రెండుమూడేళ్లు ఆడొచ్చు.. కోహ్లీకి కపిల్ దేవ్ కీలక సూచనలు
-
BCCI Chief Selector: కొత్త శకం మొదలు.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్‌గా దిగ్గజ స్పిన్నర్!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Palla Srinivasa Rao: స్థానిక ఎన్నికలపై పల్లా శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు.. మాకు అవే ముఖ్యం..!
ట్రెండింగ్
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
-
165Hz OLED డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
2K+ 165Hz AMOLED డిస్ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?