India vs Sri Lanka Asia Cup 2023 Live Score Updates: ఆసియా కప్ 2023 ఫైనల్ పోరు ప్రారంభమైంది. కొలంబోలోని ఆర్.ప్రేమదాస మైదానంలో భారత్, శ్రీలంక జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచులో టాస్ గెలిచిన శ్రీలంక కెప్టెన్ శనక టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఒక మార్పుతో లంక బరిలోకి దిగింది. మరోవైపు భారత్ కూడా ఓ మార్పుతో ఫైనల్ మ్యాచ్ ఆడుతోంది. అయితే.. వర్షం కారణంగా మ్యాచ్ ఆలస్యంగా మొదలైంది.
-
ఆసియా కప్ 2023 విజేత భారత్
ఆసియా కప్ 2023 ఫైనల్ లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో భారత్ ఘన విజయం సాధించింది. 6.1 ఓవర్లలోనే టార్గెట్ ను ఫినిష్ చేశారు. ఇషాన్ కిషన్ 23, శుభ్ మన్ గిల్ 27 పరుగులు చేశారు.
-
ప్రారంభమైన ఇండియా ఇన్నింగ్స్
ఇండియా-శ్రీలంక మధ్య ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ లో శ్రీలంక తక్కువ స్కోరుకే ఆలౌటైంది. దీంతో ఇండియా ఇన్నింగ్స్ ప్రారంభించింది. ఓపెనర్లుగా శుభ్ మన్ గిల్, ఇషాన్ కిషన్ బరిలోకి దిగారు. ప్రస్తుతం భారత్ స్కోరు 2 ఓవర్లు ముగిసే సరికి 17 పరుగులు చేశారు. ఇషాన్ కిషన్ (13), గిల్ (4) పరుగులతో క్రీజులో ఉన్నారు.
-
శ్రీలంక 50 పరుగులకు ఆలౌట్.. భారత్ టార్గెట్ 51 రన్స్
ఆసియా కప్ ఫైనల్: 50 పరుగులకు శ్రీలంక ఆలౌట్ అయింది. సిరాజ్ దెబ్బకు శ్రీలంక టీమ్ విలవిలలాడిపోయింది. ఆల్ రౌండర్ హార్థిక్ పాండ్యా చివరలో 3 వికెట్లు తీశాడు. మహ్మద్ సిరాజ్.. 7 ఓవర్లలో 21 పరుగులిచ్చి 6 వికెట్లు తీశాడు. ఒక ఓవర్ కూడా మెయిడిన్ వేశాడు. హార్దిక్ పాండ్యా 2.2 ఓవర్లలో 3 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. బుమ్రా ఒక వికెట్ తీశాడు. 5 ఓవర్లలో 23 పరుగులు ఇచ్చాడు. శ్రీలంక తరఫున కుశాల్ మెండిస్ అత్యధికంగా 17 పరుగులు చేశాడు. హేమంత 13 పరుగులు చేశాడు.
-
సిరాజ్ చేతిలో ఏముందబ్బా.. మరో వికెట్ తీసిన హైదరాబాదీ బౌలర్
ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ లో సిరాజ్ చెలరేగిపోతున్నాడు. 11.2 ఓవర్ దగ్గర మరో వికెట్ తీశాడు. దీంతో ఇప్పటివరకు మొత్తం 6 వికెట్లు తీశాడు. దీంతో శ్రీలంక మిడిలార్డర్ మొత్తం కుప్పకూలిపోయింది. ఇక తర్వాత ఉన్నది బౌలర్లు మాత్రమే.. ప్రస్తుతం స్కోరు 11.5 ఓవర్ల దగ్గర 39/7 ఉంది.
-
లంకేయుల భరతం పట్టిన సిరాజ్.. దెబ్బ మాములుగా లేదుగా..
హైదరాబాద్ బౌలర్ సిరాజ్ దెబ్బకు శ్రీలంక బ్యాట్ మెన్లు విలవిలలాడిపోయారు. ఒకే ఓవర్ లో 4 వికెట్లు తీసిన మహ్మద్ సిరాజ్.. మళ్లీ ఆ తర్వాత వేసిన ఓవర్ లో మరో వికెట్ తీశాడు. దీంతో 7 ఓవర్లు ముగిసేసరికి శ్రీలంక స్కోరు 18/6 ఉంది.
-
మరో వికెట్ కోల్పోయిన శ్రీలంక.. సిరాజ్ విజృంభణ
భారత్-శ్రీలంక మధ్య జరిగే ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ లో శ్రీలంక మరో వికెట్ కోల్పోయింది. మహ్మద్ సిరాజ్ వేసిన రెండు ఓవర్ లో 4 వికెట్లు తీశారు. దీంతో శ్రీలంక మిడిలార్డర్ మొత్తం కుప్పకూలింది.
-
IND vs SL: ప్రారంభమైన మ్యాచ్.. మొదటి ఓవర్లోనే వికెట్
భారత్-శ్రీలంక మధ్య జరిగే ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ ప్రారంభమైంది. శ్రీలంక ఓపెనర్లు నిస్సాంకా, కుశాల్ పెరీరా బరిలోకి దిగారు. అయితే తొలి ఓవర్ ను ప్రారంభించిన భారత్ మొదట్లోనే వికెట్ పడగొట్టింది. జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్ లో మొదటి వికెట్ తీసి శుభారంబాన్ని అందిచాడు
-
మళ్లీ వచ్చేసిన వరుణుడు.. ప్రారంభం కాని మ్యాచ్
ఇండియా-శ్రీలంక మధ్య జరిగే మ్యాచ్ మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం కావల్సి ఉండగా.. వర్షం పడుతుండంతో ఇంకా ప్రారంభం కాలేదు. ఇప్పటికే టాస్ గెలిచిన శ్రీలంక బ్యాటింగ్ ఎంచుకుంది.
-
తుది జట్లు:
తుది జట్లు:
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ (కీపర్), ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్.
శ్రీలంక: పాతుమ్ నిస్సాంక, కుశాల్ పెరీరా, కుశాల్ మెండిస్ (కీపర్), సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక, ధనంజయ డిసిల్వా, దసున్ షనక (కెప్టెన్), దునిత్ వెల్లలాగే, దుషన్ హేమంత, ప్రమోద్ మదుషన్, మతీషా పతిరన.
-
అక్షర్ స్థానంలో సుందర్
గాయపడ్డ తీక్షణ స్థానంలో దుషాన్ హేమంతను జట్టులోకి తీసుకున్నట్లు లంక కెప్టెన్ డాసున్ శనక తెలిపాడు. అక్షర్ పటేల్ స్థానంలో వాషింగ్టన్ సుందర్ వచ్చినట్టు భారత కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పాడు.