Site icon NTV Telugu

IND vs SA: టీమిండియా విజయానికి ఐదు ప్రధాన కారణాలు ఇవే..

Ind Vs Sa Odi

Ind Vs Sa Odi

IND vs SA: దక్షిణాఫ్రికాతో జరిగిన మూడవ ODIలో టీమిండియా సూపర్ ఆటతీరుతో మ్యాచ్‌ విజయంతో పాటు ODI సిరీస్‌ను కైవసం చేసుకుంది. భారత జట్టు బౌలింగ్, బ్యాటింగ్ విభాగాలలో అద్భుత ప్రదర్శన చేసి విజయాన్ని లాంఛనం చేసుకుంది. టీమిండియా 10.1 ఓవర్లు, తొమ్మిది వికెట్లు మిగిలి ఉండగానే దక్షిణాఫ్రికా నిర్దేశించిన 271 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది చిరస్మరణీయ గెలుపును సొంతం చేసుకుంది. రోహిత్ శర్మ 73 బంతుల్లో ఏడు ఫోర్లు, మూడు సిక్సర్లతో 75 పరుగులు చేయగా, విరాట్ కోహ్లీ 45 బంతుల్లో ఆరు ఫోర్లు, మూడు సిక్సర్లతో 65 పరుగులు చేశాడు. జైస్వాల్ 121 బంతుల్లో 12 ఫోర్లు, రెండు సిక్సర్లతో అజేయంగా 116 పరుగులు చేసి టీమిండియా విజయానికి కీ రోల్ ప్లే చేశాడు. అంతకుముందు బౌలర్లు ప్రసిద్ధ్ కృష్ణ, కుల్దీప్ యాదవ్ చెరో నాలుగు వికెట్లు పడగొట్టడంతో భారత్ 47.5 ఓవర్లలో దక్షిణాఫ్రికాను 270 పరుగులకు ఆలౌట్ చేసింది.

READ ALSO: Rohit Sharma: వరల్డ్ రికార్డ్ జస్ట్‌లో మిస్ అయిన హిట్‌మ్యాన్..

భారత బౌలర్ కుల్దీప్ యాదవ్ మరోసారి తన స్పిన్‌తో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెట్టాడు. 10 ఓవర్లలో 41 పరుగులకు 4 వికెట్లు పడగొట్టి దక్షిణాఫ్రికాను 270 పరుగులకే పరిమితం చేయడంలో ఈ స్టార్ బౌలర్ సూపర్ సక్సెస్ అయ్యాడు. ఈ అద్భుతమైన స్పెల్‌తో వన్డేల్లో కుల్దీప్ అత్యధికంగా నాలుగు వికెట్లు తీసిన మూడవ భారతీయ బౌలర్‌గా రికార్డ్ సృష్టించాడు. అలాగే ఫాస్ట్ బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణ తన రెండవ స్పెల్‌లో అద్భుతమైన పేస్, కచ్చితత్వాన్ని ప్రదర్శించి, క్వింటన్ డి కాక్‌తో సహా మొత్తం నాలుగు వికెట్లు పడగొట్టాడు.

అలాగే ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో రోహిత్ 27 పరుగులు చేసిన తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌లో 20 వేల పరుగులను చేరుకున్నాడు. సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్, విరాట్ కోహ్లీ తర్వాత ఈ మైలురాయిని చేరుకున్న నాల్గవ బ్యాట్స్‌మాన్‌గా, మొత్తం మీద 14వ బ్యాట్స్‌మాన్‌గా రికార్డు సృష్టించాడు. యశస్వి జైస్వాల్ – రోహిత్ శర్మ 155 పరుగుల అద్భుతమైన ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇది టీమిండియాకు శుభారంభాన్ని ఇచ్చింది. వన్డేల్లో దక్షిణాఫ్రికాపై భారతదేశం రెండవ అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్యం ఇదే. 2001లో జోహన్నెస్‌బర్గ్‌లో సచిన్ టెండూల్కర్ – సౌరవ్ గంగూలీల 193 పరుగుల భాగస్వామ్యం మాత్రమే దీనికి ముందు ఉన్న రికార్డు భాగస్వామ్యం. వన్డేల్లో యశస్వి తన తొలి సెంచరీని 111 బంతుల్లో సాధించాడు.

దక్షిణాఫ్రికాతో జరిగిన ఈ వన్డే సిరీస్‌లో ఇప్పటికే రెండు సెంచరీలు చేసిన విరాట్ కోహ్లీ, మూడో వన్డేలో టీమిండియా సాధించిన అద్భుతమైన విజయంలో కూడా కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో విరాట్ కేవలం 40 బంతుల్లో తన 76వ వన్డే అర్ధ సెంచరీని లిఖించాడు. 45 బంతుల్లో ఆరు ఫోర్లు, మూడు సిక్సర్లతో సహా 65 పరుగులు చేసి విజయాన్ని లాంఛనం చేశాడు.

కుల్దీప్ స్పిన్, ప్రసిద్ధ్ పేస్, రోహిత్ క్లాసిక్ బ్యాటింగ్, యశస్వి సెంచరీ, విరాట్ సూపర్ ఇన్సింగ్స్ ప్రదర్శనలన్నీ ఈ మ్యాచ్‌లో భారత్‌ను బలంగా ముందుకు తీసుకెళ్లి టీమిండియాకు అద్భుతమైన విజయాన్ని అందించాయి. ఈ మ్యాచ్ విజయంతో భారతదేశం సిరీస్‌ను 2-1తో గెలుచుకుంది.

READ ALSO: BSBD Account Benefits: జీరో బ్యాలెన్స్ ఖాతాదారులకు గుడ్ న్యూస్..

Exit mobile version