NTV Telugu Site icon

IndVsPak: వరల్డ్ కప్ లో ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్ టికెట్స్ విడుదల ముహూర్తం ఖరారు

Ind Vs Pak Tickets

Ind Vs Pak Tickets

క్రికెట్ ఫ్యాన్స్ కు ఐసీసీ శుభవార్త చెప్పింది. వన్డే వరల్డ్ కప్-2023 టికెట్ల అమ్మకానికి సంబంధించిన తేదీలను ఇవాళ ( మంగళవారం ) రిలీజ్ చేసింది. దశలవారీగా జరిగే టిక్కెట్ల అమ్మకాల కోసం రిజిస్ట్రేషన్ దశ ఇది వరకే స్టార్ట్ కాగా.. ఆగస్టు 25 నుంచి టిక్కెట్ల కొనుగోలు దశ స్టార్ట్ అవుతుందని వెల్లడించింది. వరల్డ్ కప్ మొత్తంలో అత్యంత ఆసక్తికరమైన మ్యాచ్ దాయాది దేశాల మధ్య సమరానికి సంబంధించిన టికెట్ల విక్రయం సెప్టెంబర్ 3 నుంచి స్టార్ట్ అవుతుందని ఐసీసీ తెలిపింది.

Read Also: Revolver Prabal: మహిళల భద్రతే ప్రధాన లక్ష్యంగా సరికొత్త రివాల్వర్

కాగా.. ఇవాళ్టి( ఆగస్ట్ 15 ) నుంచి www.cricketworldcup.com వెబ్ సైట్ లో వన్డే ప్రపంచకప్ అప్ డేట్స్ గురించి తెలుసుకోచవచ్చని ఐసీసీ పేర్కొనింది. అక్టోబర్ 5న ఇంగ్లండ్ న్యూజిలాండ్ మధ్య తొలి మ్యాచ్ జరుగనుండంతో ఈ మెగా ఈవెంట్ ఆరంభం అవుతుంది. ఈ మెగా టోర్నీలో టీమిండియా తమ తొలి మ్యాచ్ ( అక్టోబర్ 5 ) లో ఆస్ట్రేలియాతో ఆడనుంది. ఇక చిరకాల ప్రత్యర్థులైన భారత్-పాకిస్థాన్ టీమ్స్ మధ్య అహ్మదాబాద్ వేదికగా అక్టోబర్ 14న మ్యాచ్ జరుగనుంది.

Read Also: Akhil Akkineni: అయ్యగారికి ఆ హీరోయినే కావాలంట.. ?

టికెట్ల అమ్మకాల ప్రారంభ తేదీల వివరాలు..

ఆగస్ట్‌ 25: నాన్-ఇండియా వార్మప్ మ్యాచ్‌లు, అన్ని నాన్-ఇండియా మ్యాచ్‌లు
ఆగ‌స్టు 30: గౌహతి, త్రివేండ్రంలలో టీమిండియా ఆడే మ్యాచ్‌లు
ఆగ‌స్టు 31: చెన్నై, ఢిల్లీ, పూణేలలో భారత జట్టు ఆడే మ్యాచ్‌లు
సెప్టెంబ‌ర్ 1: ధర్మశాల, ల‌క్నో, ముంబైలలో ఇండియా ఆడే మ్యాచ్‌లు
సెప్టెంబ‌ర్ 2: బెంగ‌ళూరు, కోల్‌క‌తాలలో టీమిండియా ఆడే మ్యాచ్‌లు
సెప్టెంబ‌ర్ 3: అహ్మదాబాద్‌లో టీమిండియా ఆడే మ్యాచ్‌ (భార‌త్ వర్సెస్‌ పాకిస్థాన్ మ్యాచ్)
సెప్టెంబ‌ర్ 15: సెమీఫైన‌ల్స్, ఫైన‌ల్ మ్యాచ్‌ల టికెట్లు రిలీజ్