U19 Asia Cup Final: పాకిస్థాన్ ప్లేయర్స్‌ను చూస్తేనే రగిలిపోతున్న టీమిండియా కుర్రాళ్లు.. వీడియోలు వైరల్

India Vs Pakistan U19 Asia Cup Final 1

India Vs Pakistan U19 Asia Cup Final 1

India vs Pakistan U19 Asia Cup Final: ఇండియా (India), పాకిస్తాన్ (Pakistan) మధ్య జరిగిన అండర్-19 ఆసియా కప్ ఫైనల్ (U19 Asia Cup Final) ఒక క్లాసిక్ మ్యాచ్‌లా ముగిసింది. కానీ, గెలిచిన తర్వాత మన కుర్రాళ్లు చేసిన సెలబ్రేషన్స్ (Celebrations) కాస్త హద్దు దాటాయా అనే చర్చ ఇప్పుడు జోరుగా నడుస్తోంది. శనివారం సాయంత్రం జరిగిన ఈ మ్యాచ్‌లో ఒక దశలో టీమిండియా (Team India) ఓడిపోవడం ఖాయమని అంతా అనుకున్నారు. 338 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో (Target Chase) 8 వికెట్లు కోల్పోయి, ఇంకా 51 బంతుల్లో 86 పరుగులు చేయాల్సిన స్థితిలో భారత్ కష్టాల్లో పడింది. పాకిస్తాన్ (Pakistan) ఆల్మోస్ట్ కప్పు కొట్టేసినంత పని చేసింది. కెప్టెన్ లక్ష్య రాయ్‌చందాని (Lakshya Raichandani) 80 రన్స్, ఆర్యవీర్ సెహ్వాగ్ (Aaryavir Sehwag) 58 రన్స్ చేసి పోరాడినా, 252/8 స్కోరు వద్ద ఆశలన్నీ ఆవిరైనట్లే కనిపించాయి. సరిగ్గా అప్పుడే లోయర్ ఆర్డర్ (Lower Order) బ్యాటర్లు మోహిత్ ఉల్వా (Mohit Ulva), మనల్ చౌహాన్ (Manal Chauhan) మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశారు. ఏడో నంబర్‌లో వచ్చిన మనల్ 32 బంతుల్లో 47 రన్స్ చేయగా, పదో నంబర్‌లో దిగిన ఉల్వా కేవలం 26 బంతుల్లో అజేయంగా 49 పరుగులు బాదాడు. వీరిద్దరూ 9వ వికెట్‌కు 57 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి భారత్‌ను గెలుపు అంచుల దాకా తీసుకొచ్చారు. 302 పరుగుల వద్ద మనల్ అవుట్ అవ్వడంతో ఇంకా 36 పరుగులు కావాలి, చేతిలో ఒక్క వికెట్ మాత్రమే ఉంది. టోర్నీలో తన మొదటి మ్యాచ్ ఆడుతున్న 11వ నంబర్ బ్యాటర్ చిగురుపాటి వెంకట (Chigurupati Venkata) క్రీజులోకి వచ్చి, 8 బంతుల్లో 11 రన్స్ చేసి ఉల్వాకు అండగా నిలిచాడు. చివరి ఓవర్లో 8 పరుగులు అవసరం కాగా, లెగ్ స్పిన్నర్ అహ్మద్ హుస్సేన్ (Ahmed Hussain) వేసిన మొదటి 5 బంతుల్లో ఒక వైడ్‌తో కలిపి 5 రన్స్ వచ్చాయి. ఆఖరి బంతికి 3 పరుగులు కావాల్సిన స్థితిలో ఉల్వా బౌండరీ (Boundary) బాదడంతో భారత్ 339/9 స్కోరుతో ఒక్క వికెట్ తేడాతో అద్భుత విజయం సాధించింది.

ఇలాంటి నమ్మశక్యం కాని గెలుపు దక్కినప్పుడు ఆటగాళ్లు సంబరాలు చేసుకోవడంలో తప్పులేదు. విన్నింగ్ రన్స్ రాగానే భారత ఆటగాళ్లు మైదానంలోకి దూసుకొచ్చి కేకలు వేస్తూ, ఒకరినొకరు కౌగిలించుకుంటూ సెలబ్రేట్ చేసుకున్నారు. అయితే ఆ తర్వాత జరిగిన కొన్ని ఘటనలే ఇప్పుడు వివాదాస్పదమయ్యాయి. సోషల్ మీడియాలో (Social Media) వైరల్ అవుతున్న వీడియోల ప్రకారం, కొందరు భారత ఆటగాళ్లు పాకిస్తాన్ ప్లేయర్ల వైపు అసభ్యకరమైన సైగలు (Inappropriate Gestures) చేసినట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా మనల్ చౌహాన్ పాక్ వికెట్ కీపర్ హంజా జహూర్ (Hamza Zahoor) వైపు అలాంటి సైగలు చేసినట్లు ఓ క్లిప్‌లో ఉంది. పరిస్థితి చేయి దాటకుండా భారత సపోర్ట్ స్టాఫ్ (Support Staff) కలుగజేసుకుని ఆటగాళ్లను శాంతింపజేయాల్సి వచ్చింది. ఆ వీడియోల పూర్తి సందర్భం ఏంటో చూడకుండా ఒక అంచనాకు రాలేము. మరికొందరు మాత్రం టీనేజర్లు (Teenagers) కాబట్టి ఆవేశంలో అలా చేసి ఉంటారని, మరీ కఠినంగా చూడకూడదు. నిజానికి ఇండియా-పాకిస్తాన్ ఫైనల్ (Indo-Pak Final) అంటే ఉండే ప్రెజర్ (Pressure) మామూలుగా ఉండదు. సీనియర్ ప్లేయర్లే ఒక్కోసారి భావోద్వేగాలను అదుపు చేసుకోలేరు. అలాంటిది ఓడిపోయే మ్యాచ్‌ను చివరి బంతికి గెలిచినప్పుడు ఆ కుర్రాళ్లలో కలిగే అడ్రినలిన్ రష్ (Adrenaline Rush) ఊహించలేనిది. వాళ్లు గెలుపును ఎంజాయ్ చేయడంలో తప్పులేదు కానీ, అతిగా ఉండొద్దని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే.. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో గతంలో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ ప్లేయర్స్ చేసిన అతి కూడా కనిపిస్తోంది. యాక్షన్, రియాక్షన్ అంటూ వీడియోలో వైరల్ అవుతున్నాయి.