Team India Predicted Playing XI: ఇషాన్, అభిషేక్ ఓపెనింగ్ కాంబో.. ఫినిషర్‌గా రింకూ.. సూర్య సేన ఇదే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Team India Predicted Playing XI: భారత్-పాకిస్థాన్ ఉత్కంఠ భరిత పోరుకు రంగం సిద్ధమైంది. భారత జట్టు ఎలాగైనా విజయం సాధించాలని కంకణం కట్టుకుంది. మరోవైపు దాయాది జట్టు సైతం కసరత్తు ముమ్మరం చేసింది. ఈ నేపథ్యంలో భారత్ జట్టుకు సంబంధించి ఊరట నిచ్చే వార్త వచ్చింది. విధ్వంసకర ప్లేయర్ అభిషేక్ శర్మ ఈ మ్యాచ్‌లో ఉంటాడని కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ నిన్న మీడియా సమావేశంలో వెల్లడించాడు. ఈ నేపథ్యంలో పాకిస్థాన్‌తో తలపడే సూర్య సేన జట్టు అంచనాలను చూద్దాం. అనారోగ్యంతో నమీబియా మ్యాచ్ మిస్ అయిన స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ మళ్లీ జట్టులోకి వస్తున్నాడు. ఇషాన్ కిషన్‌తో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించనున్నాడు. ఇప్పటికే ఇషాన్ ఈ టోర్నీలో మంచి ఫామ్‌లో ఉన్నాడు. దాయాది జట్టు పాక్ పై అదే జోరు కొనసాగించాలని చూస్తున్నాడు. అభిషేక్ రావడంతో సంజూ శాంసన్‌కు ఈ మ్యాచ్‌లో అవకాశం దక్కేలా కనిపించడం లేదు.
READ MORE: Karuppu : సూర్య ‘కరుప్పు’ సినిమా రిలీజ్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన దర్శకుడు ఆర్జే బాలాజీ
Also Read
- CM Chandrababu: బుర్రిపాలెంలో కృష్ణ సినిమా హీరో.. పెమ్మసాని పొలిటికల్ హీరో!
- Shivraj Singh Chouhan: చంద్రబాబు నాయుడు డైనమిక్ లీడర్.. ఏపీ దేశంలోనే నంబర్ వన్ అవుతుంది!
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
మూడో స్థానంలో తిలక్ వర్మ, నాలుగో స్థానంలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ చేయడం ఆల్మోస్ట్ ఖరారైంది. ఈ మ్యాచ్‌లో మిడిల్ ఆర్డర్‌పై ఎక్కువ బాధ్యత ఉంటుంది. హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే ఇద్దరూ భారీ షాట్లు ఆడగల సామర్థ్యం ఉన్నవాళ్లు. అవసరమైతే బౌలింగ్‌లోనూ కీలక పాత్ర పోషిస్తారు. చివర్లో రింకూ సింగ్ ఫినిషర్‌గా జట్టుకు బలం చేకూర్చనున్నాడు. రింకూ మ్యాచ్ చివర్లో మంచి స్కోర్ చేయగలడనే నమ్మకం ఉంది. ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ సైతం జట్టులో కీలకంగా మారుతాడు. స్పిన్ విభాగంలో వరుణ్ చక్రవర్తి ప్రధాన పాత్ర పోషిస్తాడని అంచనా. కుల్దీప్ యాదవ్ సైతం ఆప్షన్‌గా ఉన్నా.. ప్రస్తుతం ఉన్న ఈ జట్టును మార్చాలని టీమ్ మేనేజ్మెంట్ అనుకోవడం లేదట. పేస్ విభాగంలో జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్ కీలక బౌలర్లుగా ఉంటారు. పవర్‌ప్లేలో వికెట్లు తీసి ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచే బాధ్యత వీళ్లు తీసుకుంటారు. మొత్తానికి చూస్తే భారత్ బలమైన కాంబినేషన్‌తో మైదానంలోకి దిగనుంది. ఈ రెండు జట్లు ఇప్పటివరకు ఓటమిని చవిచూడలేదు. అందుకే ఈ మ్యాచ్ గెలిచే జట్టే గ్రూప్ టాపర్‌గా నిలిచే అవకాశం కనిపిస్తోంది. అభిమానులంతా ఇప్పుడు ఈ భారీ పోరును ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
READ MORE: IND vs PAK: త్రో బౌలర్ ఉస్మాన్ తారిఖ్‌ను ఎదుర్కొనేందుకు.. సూర్య మాస్టర్ ప్లాన్, ఇక డబిడదిబిడే!
భారత్ అంచనా జట్టు: అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, రింకూ సింగ్, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్.
తాజావార్తలు
-
Don’t Trouble The Trouble: రాజమౌళికి బిగ్ షాక్
-
Srikanth Odela: సుకుమార్ కోసం.. ఇండియాలోనే నెం.1 డైరెక్టర్ ఆఫర్‌కి ‘నో’ చెప్పిన శ్రీకాంత్ ఓదెల!
-
Matsya: పడవ కింద నుంచి వెళ్లిన ‘మిథికల్ ఫిష్’.. టాలీవుడ్లో మరో గ్రాండ్ విజువల్ వండర్ ‘మత్స్య’!
-
IndiGo : శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఇండిగో విమానానికి తప్పిన ప్రమాదం
-
CM Chandrababu: బుర్రిపాలెంలో కృష్ణ సినిమా హీరో.. పెమ్మసాని పొలిటికల్ హీరో!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!