NTV Telugu Site icon

India vs New Zealand: వర్షం కారణంగా ఐదవ రోజు ఆట ఆలస్యం

India Vs New Zealand

India Vs New Zealand

India vs New Zealand 1st Test Day 5: బెంగుళూరులో భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టులో ఐదో రోజు న్యూజిలాండ్ గెలవాలంటే 107 పరుగులు చేయాలి. భారత జట్టు గెలవాలంటే 10 వికెట్లు పడగొట్టాలి. న్యూజిలాండ్‌కు ఈ లక్ష్యం కష్టమేమీ కానప్పటికీ వర్షం కురిసే అవకాశం మాత్రం కివీ జట్టుకు అడ్డంకిగా మారవచ్చు. ఉదయం 9 నుంచి 10 గంటల మధ్య వర్షం కురిసే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

Chandra Arya: కెనడాలోని హిందువులు తమ భద్రత కోసం భయపడుతున్నారు: కెనడా ఎంపీ చంద్ర ఆర్య

ఇకపోతే, తాజా సమాచారం మేరకు భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టులో ఐదో రోజు ఆట వర్షం కారణంగా ఆలస్యంగా ప్రారంభం కానుంది. ఫీల్డ్ నుండి కవర్లు తొలగించబడ్డాయి. ప్రస్తుతం గ్రౌండ్ లో కొన్ని చోట్ల నీరు నిలిచి ఇది. 10 గంటలకు మ్యాచ్ ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. చూడాలి మరి వరుణ దేవుడు ఎవరిని కరుణిస్తాడో. ఇక భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 462 పరుగులు చేసింది. దింతో భారత జట్టు పటిష్ట స్థితిలో ఉండేలా చూసింది. సర్ఫరాజ్ ఖాన్, రిషబ్ పంత్ మధ్య నాలుగో వికెట్‌కు వీరిద్దరి మధ్య 177 పరుగుల భాగస్వామ్యం నెలకొంది. భారత్ తరఫున సర్ఫరాజ్ ఖాన్ ఇన్నింగ్స్ 150 పరుగులు చేశాడు. మరోవైపు రిషబ్ పంత్ 99 పరుగులు చేశాడు. పంత్ కేవలం 1 పరుగు తేడాతో సెంచరీ కోల్పోయాడు. విరాట్ కోహ్లీ 70 పరుగుల ఇన్నింగ్స్ ఆడగా, రోహిత్ శర్మ 52 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. న్యూజిలాండ్ తరఫున మ్యాట్ హెన్రీ 3 వికెట్లు, ఒరూర్కే 3 వికెట్లు, అజాజ్ పటేల్ 2 వికెట్లు తీశారు.