NTV Telugu Site icon

IND vs NZ: విజయం ముందర బొక్కబోర్లా పడిన టీమిండియా.. క్లీన్ స్వీప్ చేసిన కివీస్

Ind Vs Nz

Ind Vs Nz

India vs New Zealand 3rd Test Mumbai: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ లో భాగంగా జరిగిన భారత్, న్యూజిలాండ్ 3 టెస్టుల సిరీస్ లో భాగంగా టీమిండియా ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. ముంబైలో జరిగిన మూడో టెస్టులో టీమిండియా విజయం ముందర బొక్కబోర్లా పడింది. దాంతో 25 పరుగులతో కివిస్ విజయాన్ని అందుకుంది. ఈ ఓటమితో టీమిండియా న్యూజిలాండ్ చేతిలో 3 – 0 తో క్లీన్ స్వీప్ అయ్యింది. దీంతో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ చేరుకునేందుకు టీమిండియా పరిస్థితి దారుణంగా తయారయింది. ఆస్ట్రేలియాతో జరగబోయే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో కచ్చితంగా నాలుగు టెస్టులు గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Read Also: WI vs ENG: వెస్టిండీస్‭కు చుక్కలు చూపించిన లివింగ్‌స్టోన్.. 37 ఏళ్ల తర్వాత ఆ పనిచేసిన ఇంగ్లాండ్

ఇక పోతే, ముంబై టెస్టులో టీమిండియా కివీస్ చితిలో 25 పరుగులతో ఓటమి పాలైంది. న్యూజిలాండ్ మొదటి ఇన్నింగ్స్ లో 235 పరుగులు చేసే ఆల్ అవుట్ కాగా.. అందుకు ప్రతికగా టీమిండియా 263 పరుగులతో స్వల్ప ఆధిక్యాన్ని అందుకుంది. అయితే, రెండో ఇన్నింగ్స్ లో న్యూజిలాండ్ టీమిండియా బౌలర్స్ ను ప్రతిఘటించి 174 పరుగులను సాధించి టీమిండియాకు 147 పరుగుల లక్ష్యాన్ని అందించింది. స్వల్ప లక్ష్యాన్ని చేధించేందుకు వచ్చిన టీమిండియా వరుస వికెట్లను చేజార్చుకొని.. కేవలం 29 పరుగులకే ఐదు వికెట్లను కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ తర్వాత రిషబ్ పంత్, వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా పోరాటం చేసిన టీమిండియాకు విజయాన్ని అందించలేకపోయారు. దీంతో టీమిండియా క్లీన్ స్విప్ కు గురైంది. కివీస్ స్పిన్నర్లు.. అజాజ్ పటేల్ 6 వికెట్లు, గెలెన్ ఫిలిప్స్ నాలుగు వికెట్లు తీసి టీమిండియా ఓటమిని శాసించారు.

Read Also: IND vs NZ: పీకల్లోతు కష్టాల్లో భారత్.. 29 పరుగులకే 5 వికెట్లు