Site icon NTV Telugu

India vs New Zealand 1st ODI: భారత్ టార్గెట్ 301 పరుగులు..

India Vs New Zealand

India Vs New Zealand

India vs New Zealand 1st ODI: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా భారత్ – న్యూజిలాండ్ జట్ల మధ్య నేడు (జనవరి 11) వడోదరలోని కోటంబి స్టేడియంలో తొలి మ్యాచ్ జరుగుతోంది. టాస్‌ నెగ్గిన టీమిండియా బౌలింగ్‌ ఎంచుకుంది. ముందుగా బ్యాటింగ్‌ చేసిన న్యూజిలాండ్ జట్టు భారత్‌కు 301 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. నిర్ణీత 50 ఓవర్లలో న్యూజిలాండ్ ఎనిమిది వికెట్ల నష్టానికి 300 పరుగులు చేసింది. డారిల్ మిచెల్ 84 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మిచెల్‌తో పాటు ఓపెనర్లు డేవన్ కాన్వే (56), హెన్రీ నికోల్స్‌ (62) హాఫ్‌ సెంచరీలు నమోదు చేశారు. టీమిండియా బౌలర్లలో హర్షిత్ రాణా 2, సిరాజ్ 2, ప్రసిద్ధ్‌ కృష్ణ 2, కుల్‌దీప్‌ యాదవ్ ఒక వికెట్ పడగొట్టారు.

READ ALSO: Masood Azhar: ‘‘వేల సంఖ్యలో సూసైడ్ బాంబర్లు’’.. ఉగ్రవాది మసూద్ అజార్ వణికించే ప్రకటన..

ఈ మ్యాచ్‌లో టీమిండియా తరపున అర్ష్‌దీప్ సింగ్, ధ్రువ్ జురెల్, నితీష్ కుమార్ రెడ్డి, యశస్వి జైస్వాల్ ఆడలేదు. న్యూజిలాండ్ తరపున క్రిస్టియన్ క్లార్క్ వన్డే అరంగేట్రం చేశాడు. భారత సంతతికి చెందిన క్రికెటర్ ఆదిత్య అశోక్ కూడా కివీస్ జట్టు ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు సంపాదించాడు.

భారత జట్టు: శుభ్‌మన్‌ గిల్‌, రోహిత్‌శర్మ, విరాట్‌ కోహ్లీ, కేఎల్‌ రాహుల్‌, శ్రేయస్‌ అయ్యర్‌, రవీంద్ర జడేజా, వాషింగ్టన్‌ సుందర్‌, హర్షిత్‌ రాణా, కుల్‌దీప్‌ యాదవ్‌, మహ్మద్‌ సిరాజ్‌, ప్రసిద్ధ్‌ కృష్ణ

న్యూజిలాండ్‌ జట్టు: డెవాన్‌ కాన్వే, హెన్రీ నికోల్స్‌, విల్‌ యంగ్‌, డారిల్‌ మిచెల్‌, గ్లెన్‌ ఫిలిప్స్‌, మిచెల్‌ హే, బ్రేస్‌వెల్‌, జాక్‌ ఫౌక్స్‌, క్రిస్టియన్‌ క్లార్క్‌, కైల్‌ జెమీసన్‌, ఆదిత్య అశోక్‌

READ ALSO: Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌కు అరుదైన బిరుదు ‘టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్’

Exit mobile version