India vs Japan: భారత్, జపాన్ మధ్య చారిత్రాత్మక టీ20.. ‘స్నేహం కొత్త ఇన్నింగ్స్’ అంటూ జపాన్ అంబాసిడర్ పోస్ట్.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India vs Japan: భారత్, జపాన్ క్రికెట్ జట్లు తొలిసారి మైదానంలో తలపడేందుకు సిద్ధమయ్యాయి. సెప్టెంబర్ 22న జపాన్‌లోని సానో వేదికగా ఇరు జట్ల మధ్య ప్రత్యేక టీ20 మ్యాచ్ జరగనుంది. ఈ చారిత్రాత్మక మ్యాచ్‌కు ముందు భారత్‌లోని జపాన్ అంబాసిడర్ ఓనో కేయిచి టీమిండియా ఆటగాళ్లను కలిశారు.
భారత్, జపాన్ మధ్య జరగనున్న ఈ ప్రత్యేక మ్యాచ్‌కు ‘సుజుకి కప్’గా పేరు పెట్టారు. అయితే టీమిండియాతో సమావేశమైన తర్వాత జపాన్ అంబాసిడర్ ఓనో కేయిచి ఈ మ్యాచ్‌ను మరో ప్రత్యేక పేరుతో అభివర్ణించారు. తన ఎక్స్ ఖాతాలో దీనిని ‘స్నేహం కొత్త ఇన్నింగ్స్’గా పేర్కొన్నారు. భారత్, జపాన్ క్రికెట్ జట్లు తొలిసారి అంతర్జాతీయ స్థాయిలో తలపడబోతున్నాయి. అయితే కేవలం ఇదే కారణంగా ఈ మ్యాచ్‌ను చారిత్రాత్మకంగా చూడటం లేదు. భారత్, జపాన్ మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఈ ప్రత్యేక మ్యాచ్‌ను నిర్వహిస్తున్నారు.
Also Read
రెండు దేశాల మధ్య క్రీడా రంగంలో సహకారాన్ని మరింత పెంచే లక్ష్యంతో ‘స్పోర్ట్ 75’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. భారత్, జపాన్ మధ్య దౌత్య సంబంధాల 75వ వార్షికోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. భారత్,జపాన్ టీ20 మ్యాచ్‌ను ఈ దిశగా తొలి అడుగుగా భావిస్తున్నారు. భారత్, జపాన్ మధ్య టీ20 మ్యాచ్ సెప్టెంబర్ 22న ఉదయం 9:30 గంటలకు భారత కాలమానం ప్రకారం ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ ద్వారా క్రికెట్‌ను కొత్త ప్రేక్షకులకు మరింత చేరువ చేయవచ్చని బీసీసీఐ అధ్యక్షుడు మిథున్ మన్హాస్ పేర్కొన్నారు. రెండు దేశాల మధ్య స్నేహ సంబంధాలను క్రీడల ద్వారా మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ఈ మ్యాచ్ నిర్వహిస్తున్నారు.
Dosti ki Nayi Innings 🇯🇵🏏🇮🇳
Delighted to meet @BCCI President @MithunManhas and Team India led by Captain @ShreyasIyer15.
Looking forward to the SUZUKI CUP – India-Japan 75th Anniversary Cricket Match in Sano, Tochigi, Japan on 22 September! Best wishes for the 20th Asian Games. https://t.co/1bDBe7sihd pic.twitter.com/h05LcaRWVZ— ONO Keiichi, Ambassador of Japan (@JapanAmbIndia) September 16, 2026
తాజావార్తలు
-
India vs Japan: భారత్, జపాన్ మధ్య చారిత్రాత్మక టీ20.. ‘స్నేహం కొత్త ఇన్నింగ్స్’ అంటూ జపాన్ అంబాసిడర్ పోస్ట్.!
-
PM Modi 76th Birthday: ప్రధాని మోడీ బర్త్‌డే స్పెషల్.. 2,500 దీపాలతో 25 అడుగుల సైకత శిల్పం..
-
Ram Charan New Movie: ఇదెక్కడి కాంబో మామ.. టెన్షన్ పడుతున్న ‘మెగా’ ఫాన్స్!
-
Mahesh Babu: వారణాసి తర్వాత.. వాట్ నెక్స్ట్.?
-
Nara Lokesh: కూటమిపై లోకేష్ కీలక వ్యాఖ్యలు.. “నో క్రాస్‌ఫైర్, నో మిస్‌ఫైర్..
ట్రెండింగ్
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!