Site icon NTV Telugu

IND vs ENG: లీడ్స్‌లో భారత్‌కు శుభారంభం.. తేలిపోయిన సాయి సుదర్శన్..!

Ind Vs Eng

Ind Vs Eng

IND vs ENG: లీడ్స్‌ వేదికగా జరుగుతున్న భారత జట్టు ఇంగ్లాండ్ పర్యటనలోని తొలి టెస్టు మ్యాచ్‌లో, తొలి రోజు మొదటి సెషన్‌ ముగిసేసరికి భారత్ 92 పరుగులకు రెండు వికెట్లు కోల్పోయింది. ఇక మ్యాచ్‌ టాస్ గెలిచిన ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ఫీల్డింగ్ ఎంచుకున్నారు. దానితో భారత్ తరఫున యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ ఓపెనింగ్ జోడీగా బరిలోకి దిగారు. ఇద్దరూ సంయమనంతో బ్యాటింగ్ చేశారు. మొదటి వికెట్‌కు 91 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. కానీ 25వ ఓవర్లో రాహుల్ 42 పరుగుల వద్ద జో రూట్ క్యాచ్‌గా ఔట్ కాగా, వెంటనే వచ్చిన డెబ్యూటెంట్ సాయి సుదర్శన్ కేవలం 4 బంతుల్లోనే పరుగులేమి చేయకుండానే పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం జైస్వాల్ 42 పరుగులతో క్రీజులో ఉన్నాడు.

Read Also: Bajaj Freedom 125: మొట్టమొదటి CNG బైకు ‘బజాజ్ ఫ్రీడమ్ 125’ ధర భారీగా తగ్గింపు..!

ఇంగ్లాండ్ బౌలర్లలో బ్రైడన్ కార్స్ ఒక వికెట్, అలాగే బెన్ స్టోక్స్ మరో వికెట్ తీశారు. ఈ మ్యాచ్‌లో శుభ్‌మన్ గిల్ కెప్టెన్సీలో భారత్ బరిలోకి దిగగా, సాయి సుదర్శన్ తన టెస్టు కెరీర్‌ను ప్రారంభించాడు. అదే విధంగా ఎనిమిదేళ్ల విరామం తర్వాత కరుణ్ నాయర్ టెస్టు జట్టులో చోటు దక్కించుకున్నాడు.

Read Also: Rahul Gandhi: పేదలు ఇంగ్లీష్ నేర్చుకోవడం బీజేపీ-ఆర్ఎస్ఎస్‌కి ఇష్టం లేదు..

ఐపీఎల్ లో అద్భుతంగా రాణించిన సాయి సుదర్శన్ ఇంగ్లాండ్ లో తేలిపోయాడు. అతని పై అభిమానులకు ఉన్న ఆశలను అడియాశలు చేసాడు. మొత్తంగా, భారత్‌కు ఆదిలోనే మద్దతుగా నిలిచిన ఓపెనర్లు మంచి ప్లాట్‌ఫాం అందించగా, రెండు వికెట్లు కోల్పోయినప్పటికీ తొలి సెషన్‌కు సంతృప్తికరమైన స్కోరుతో లంచ్‌కు వెళ్లింది.

Exit mobile version