Site icon NTV Telugu

IND vs ENG: డ్రా దిశగా భారత్, ఇంగ్లాండ్ టెస్ట్..?

Ind Vs Eng

Ind Vs Eng

IND vs ENG: లీడ్స్ వేదికగా జరుగుతున్న భారత్, ఇంగ్లాండ్ తొలి టెస్ట్ మ్యాచ్ లోని మూడో రోజు ఆసక్తికరంగా సాగుతోంది. రెండో రోజు ఆలీ పోప్ సెంచరీతో ఇంగ్లాండ్ మూడు వికెట్లు కోల్పోయి 209 పరుగులు చేసింది. ఇక మూడో రోజు మొదటి సెషన్ లో ఇంగ్లాండ్ జట్టు తమ తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల నష్టానికి 327 పరుగుల స్కోరు చేసింది. ఇంగ్లాండ్ తరపున ఓలీ పోప్ అద్భుత సెంచరీతో రాణించాడు. మూడో రోజు ఆట ప్రారంభమైన అనంతరం ఇంగ్లాండ్ జట్టు తొలి వికెట్ ఓలీ పోప్ రూపంలో కోల్పోయింది. ఓలీ పోప్ 106 పరుగులు చేసి ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్‌లో అవుటయ్యాడు.

Read Also:Vijay Deverakonda: నా వ్యాఖ్యల వల్ల బాధ కలిగితే క్షమించండి.. క్లారిటీ ఇచ్చిన హీరో..!

ఆ తర్వాత కెప్టెన్ బెన్ స్టోక్స్‌ను 52 బంతుల్లో 20 పరుగుల వద్ద మోహమ్మద్ సిరాజ్ అవుట్ చేశాడు. ఓ వైపు ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్స్ స్కోరును స్పీడ్ గా ఆడుతున్న, భారత బౌలర్లు సమయోచితంగా వికెట్లు తీసి ఒత్తిడి పెంచారు. ఇక మ్యాచ్ మిగిలిన రోజు, ఇన్నింగ్స్‌లపై రెండు జట్ల మధ్య పోరు మరింత ఉత్కంఠగా మారనుంది. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 471 పరుగులు చేసింది.

Read Also:Iran Russia Meeting: యుద్ధంలోకి అమెరికా ఎంట్రీ.. రేపు రష్యాకు ఇరాన్ విదేశాంగ మంత్రి!

మూడో రోజు తొలి సెషన్‌లో ఫాస్ట్ బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణ 137 బంతుల్లో 106 పరుగులు చేసిన ఇంగ్లాండ్ స్టార్ బ్యాట్స్‌మన్ ఓల్లీ పోప్‌ను చేశాడు. ఆపై మహ్మద్ సిరాజ్ బౌలింగ్ లో రిషబ్ పంత్ కు బెన్ స్టోక్స్ 52 బంతుల్లో 20 పరుగులు చేసి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఆదివారం జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్ మూడో రోజు తొలి సెషన్ లో ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు రెండు వికెట్లు కోల్పోయి 118 పరుగులు చేసింది. జేమీ స్మిత్ 29 పరుగులు చేసి, హ్యారీ బ్రూక్ 57 పరుగులు చేసి ఆడుతున్నారు.

Exit mobile version