Site icon NTV Telugu

India vs England: సాయి సుదర్శన్ అరంగ్రేటం.. మొదట బ్యాటింగ్ చేయనున్న భారత్..!

India Vs England

India Vs England

India vs England: ఇంగ్లాండ్, భారత్ మధ్య జరుగుతున్న ఐదు టెస్టుల సిరీస్ లో తొలి మ్యాచ్ లీడ్స్‌ లోని హెడింగ్లీ స్టేడియంలో మొదలయింది. ఇక టాస్ గెలిచిన ఇంగ్లాండ్ భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. భారత జట్టులో యువ బ్యాటర్ సాయి సుదర్శన్‌ కు టెస్టు అరంగేట్ర అవకాశం లభించింది. ఇటీవల ఐపీఎల్ లో అద్భుతంగా రాణించిన సుదర్శన్‌ ఎంపికతో కొత్త శక్తిని జట్టులోకి తెచ్చినట్టయింది. ఇక చాలా కాలంగా జట్టుకు దూరంగా ఉన్న కరుణ్ నాయర్‌ కూడా ప్లేయింగ్‌ XI లో చోటు సంపాదించడం గమనార్హం. ఆయన ఆఖరిసారిగా 2017లో టెస్ట్ మ్యాచ్ ఆడాడు. భారత జట్టు నలుగురు ఫాస్ట్ బౌలర్లతో ఆడనుంది.

Read Also: CM Omar Abdullah: ఉద్యోగ నియామకాల రిజర్వేషన్ అంశంపై విపక్షాలపై సీఎం ఆగ్రహం..!

ఇక 45 రోజుల పాటు జరిగే ఆండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలో శుభ్‌మాన్ గిల్ నేతృత్వంలోని జట్టు కొత్త చరిత్ర సృష్టించడానికి సిద్ధమైంది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, అశ్విన్ వంటి సీనియర్ ఆటగాళ్లు రిటైర్మెంట్ కారణంగా భారత జట్టు మార్పుల దశలో ఉంది. దీనితో ఈసారి అనుభవం లేని యంగ్ భారత జట్టు తన బలాన్ని చూపాల్సిన సమయం వచ్చింది. భారతదేశం ఇప్పటివరకు ఇంగ్లాండ్‌లో మూడుసార్లు (1971, 1986, 2007) సిరీస్‌ను గెలుచుకుంది. చివరిసారిగా భారతదేశం 2007లో రాహుల్ ద్రవిడ్ నాయకత్వంలో సిరీస్‌ను గెలుచుకుంది.

Read Also: Shekar Kammula : భారీ బడ్జెట్ కాదు.. ప్రేక్షకులు మెచ్చినవే పాన్ ఇండియా మూవీలు..

భారత్ ప్లేయింగ్ XI: యశస్వి జైస్వాల్, KL రాహుల్, సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్), కరుణ్ నాయర్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ.

ఇంగ్లాండ్ ప్లేయింగ్ XI: జాక్ క్రౌలీ, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), జామీ స్మిత్ (వికెట్ కీపర్), క్రిస్ వోక్స్, బ్రైడాన్ కార్స్, జోష్ టంగ్, షోయబ్ బషీర్.

Exit mobile version