బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. Women’s Asia Cup 2026 ఫైనల్‌కు టీమిండియా.!
- మహిళల ఆసియా కప్ 2026 ఫైనల్‌కు భారత్ అర్హత..
- తొలి సెమీఫైనల్లో బంగ్లాదేశ్‌పై భారత్ 40 పరుగుల తేడాతో విజయం
- తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 149 పరుగులు
- లక్ష్య ఛేదనలో బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 109 పరుగులు మాత్రమే
- బంగ్లాదేశ్‌పై 40 పరుగుల విజయంతో టీమిండియా ఫైనల్లోకి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Women’s Asia Cup 2026: మహిళల ఆసియా కప్ 2026లో భారత మహిళల జట్టు ఫైనల్‌కు దూసుకెళ్లింది. దుబాయ్‌లో జరిగిన తొలి సెమీఫైనల్లో బంగ్లాదేశ్‌పై భారత్ 40 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. ఆ తర్వాత లక్ష్య చేధనకు వచ్చిన బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 109 పరుగులకే పరిమితమైంది.
మ్యాచ్ విషయానికి వస్తే.. భారత్ ఇన్నింగ్స్‌లో షఫాలీ వర్మ కీలక పాత్ర పోషించింది. ఆమె 40 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 64 పరుగులు చేసింది. షఫాలీకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ప్రాతికా రావల్ 20 పరుగులు చేయగా, రిచా ఘోష్ 16 బంతుల్లో 21 పరుగులు సాధించింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ 28 బంతుల్లో 24 పరుగులతో నాటౌట్‌గా నిలిచింది. దీప్తి శర్మ కేవలం 6 బంతుల్లో 13 పరుగులు చేసి జట్టు స్కోరును 149కి చేర్చడంలో సహకరించింది. బంగ్లాదేశ్ బౌలర్లలో సుల్తానా ఖాతూన్ రెండు వికెట్లు పడగొట్టగా, మారుఫా అక్తర్, నహిదా అక్తర్, రబేయా ఖాన్ తలో వికెట్ తీశారు.
Also Read
- Smit Machchhar: ఆ టైమ్‌లో "హనుమాన్ చాలీసా" పఠించాను.. ఆ దేవుడే నన్ను కాపాడాడు..
- Anant Ambani in AP: నన్ను కూడా ఆంధ్ర బిడ్డగా భావించండి.. అనంత్ అంబానీ ఆసక్తికర వ్యాఖ్యలు..
- Shoaib Malik Fourth Marriage Rumours: 44 ఏళ్ల షోయబ్ మాలిక్ నాలుగో పెళ్లి వార్తలు..! నిజమెంత?
- PM Modi: కెప్టెన్ స్మిత్ మఛార్కి ప్రధాని మోడీ ఫోన్.. ఆ భయానక ఘటనపై ఆరా..
150 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్‌కు ఆరంభం నుంచే ఎదురుదెబ్బలు తగిలాయి. దిలారా అక్తర్ 21, జుయైరియా ఫెర్దౌస్ 14, సోభనా మొస్తరీ 18 పరుగులకె పెవిలియన్ చేరారు. బంగ్లా కెప్టెన్ నిగార్ సుల్తానా 19 పరుగులు చేయగా, షోర్నా అక్తర్ 18 బంతుల్లో 22 పరుగులతో నాటౌట్‌గా నిలిచింది. అయితే భారత బౌలర్ల కట్టుదిట్టమైన బౌలింగ్ కారణంగా బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 109/7కే పరిమితమైంది. భారత బౌలర్లలో దీప్తి శర్మ అద్భుతంగా బౌలింగ్ చేసి 4 ఓవర్లలో 26 పరుగులు ఇచ్చి 3 వికెట్లు పడగొట్టింది. నందని శర్మ 2 వికెట్లు తీయగా.. శ్రీ చరణి, ప్రేమా రావత్ చెరో వికెట్ సాధించారు. దీంతో భారత్ 40 పరుగుల తేడాతో విజయం సాధించి మహిళల ఆసియా కప్ ఫైనల్లోకి ప్రవేశించింది.
తాజావార్తలు
-
Hanuman Ansh: ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘హనుమాన్ అంశ్’ వచ్చేస్తోంది.. తెలుగు రిలీజ్ ఎప్పుడంటే?
-
Smit Machchhar: ఆ టైమ్‌లో “హనుమాన్ చాలీసా” పఠించాను.. ఆ దేవుడే నన్ను కాపాడాడు..
-
Vettri Payanam: మహిళలకు గుడ్‌న్యూస్.. ఉచిత బస్సు ప్రయాణం విస్తరణ.. ఎక్స్‌ప్రెస్, డీలక్స్ బస్సులకూ వర్తింపు
-
Anant Ambani in AP: నన్ను కూడా ఆంధ్ర బిడ్డగా భావించండి.. అనంత్ అంబానీ ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Shoaib Malik Fourth Marriage Rumours: 44 ఏళ్ల షోయబ్ మాలిక్ నాలుగో పెళ్లి వార్తలు..! నిజమెంత?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?