Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Sports India Vs Bangladesh U19 World Cup 2026 Toss Incident

India vs Ban: భారత్ vs బంగ్లాదేశ్ మ్యాచ్‌లో ఆసక్తికర సన్నివేశం.. చేయి కలపని కెప్టెన్లు!

Published Date :January 17, 2026 , 2:07 pm
By RAMAKRISHNA KENCHE
India vs Ban: భారత్ vs బంగ్లాదేశ్ మ్యాచ్‌లో ఆసక్తికర సన్నివేశం.. చేయి కలపని కెప్టెన్లు!
  • Follow Us :
  • google news
  • dailyhunt

India vs Ban: జింబాబ్వేలోని బులేవాయో వేదికగా ఇండియా, బంగ్లాదేశ్‌ మధ్య ఐసీసీ అండర్-19 వరల్డ్ కప్ 2026 మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో ఓ ఆసక్తికరమైన సంఘటన జరిగింది. భారత్, బంగ్లాదేశ్ మధ్య జరగాల్సిన మ్యాచ్‌కు ముందు టాస్ సమయంలో ఇరు జట్ల కెప్టెన్ల ప్రవర్తన అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. బంగ్లాదేశ్ రెగ్యులర్ కెప్టెన్ అజీజుల్ హకీం తమీమ్ అనారోగ్యం కారణంగా ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు. దీంతో వైస్ కెప్టెన్ జవాద్ అబ్రార్ జట్టు పగ్గాలు చేపట్టాడు. టాస్ గెలిచిన బంగ్లాదేశ్ బౌలింగ్ ఎంచుకుంది. సాధారణంగా టాస్ వేసిన తర్వాత ఇద్దరు కెప్టెన్లు నవ్వుతూ షేక్ హ్యాండ్ ఇచ్చుకోవడం క్రీడాస్ఫూర్తికి నిదర్శనం. కానీ, ఇక్కడ సీన్ పూర్తిగా మారిపోయింది. భారత కెప్టెన్ ఆయుష్ మ్హత్రే, బంగ్లాదేశ్ తాత్కాలిక కెప్టెన్ జవాద్ అబ్రార్ పక్కపక్కనే నిలబడినప్పటికీ ఒకరినొకరు పలకరించుకోలేదు. కనీసం ఒకరి ముఖం ఒకరు చూసుకోలేదు. ఎలాంటి షేక్ హ్యాండ్ లేకుండానే అబ్రార్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఇద్దరి మధ్య ఉన్న కోపం, ఆవేశం వారి ముఖాల్లో స్పష్టంగా కనిపించాయి. ఈ కోపం అక్కడితో ఆగలేదు. జాతీయ గీతం ఆలపించే సమయంలోనూ.. ఆ తర్వాత ఆటగాళ్లు మైదానంలోకి వెళ్తున్నప్పుడు కూడా ఇదే పరిస్థితి కనిపించింది. బౌండరీ లైన్ దగ్గర ఇరు జట్ల ఆటగాళ్లు కలుసుకున్నప్పటికీ, ఎవరూ ఒకరికొకరు షేక్ హ్యాండ్ ఇచ్చుకోలేదు. కనీసం మాటామంతీ కూడా కలపలేదు. భారత్ – బంగ్లాదేశ్ జట్ల మధ్య ఉన్న ఉద్రిక్త వాతావరణానికి ఈ సంఘటన అద్దం పడుతోంది. క్రీడా ప్రపంచంలో ఇలాంటి ప్రవర్తన చాలా అరుదుగా కనిపిస్తుంది.

READ MORE: రూ.10 వేల కంటే తక్కువ ధరకు iQOO Z10.. 256GB స్టోరేజీ, 50MP AI ప్రైమరీ కెమెరా

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Ayush Mhatre
  • Bulawayo cricket match
  • ICC U19 World Cup news
  • India Bangladesh cricket controversy
  • India vs Bangladesh U19 World Cup 2026

తాజావార్తలు

  • Minor Girl Cheating: ఇన్‌స్టాగ్రామ్ మాయలో మైనర్ బాలిక.. ప్రేమ, పెళ్లి పేరుతో మోసం.. లక్షలు దోచుకున్న వ్యక్తి అరెస్ట్..!

  • Iran-US: ఇరాన్-యూఎస్ మధ్య మళ్లీ ఉద్రిక్తతలు.. నౌకలపై పరస్పర దాడులు

  • LSG కొంపముంచిన Aiden Markram ఓవర్.. IPL 2026లో అత్యంత ఖరీదైన ఓవర్ నమోదు.!

  • Hit and Run Accident: కేబుల్ బ్రిడ్జిపై హిట్ అండ్ రన్.. బెంజ్ కార్ ఢీకొని యువకుడు మృతి.!

  • కళ్లు చెదిరే స్టంపింగ్‌తో MS Dhoni ని గుర్తుచేసిన Dhruv Jurel.!

ట్రెండింగ్‌

  • Chanakya Niti : ఆఫీస్ పాలిటిక్స్‌ను తెలివిగా ఎదుర్కోవడం ఎలా.? చాణక్య నీతి సూత్రాలు..!

  • Health Tips : కిడ్నీలో రాళ్లు ఉన్నప్పుడు మూత్రంలో రక్తం ఎందుకు వస్తుంది.? నిపుణుల వివరణ

  • Apple Sharbat Recipe: అద్దిరిపోయే సమ్మర్ డ్రింక్.. ‘ఆపిల్ షర్బత్’.. ఎంతో చల్లగా, రిఫ్రెషింగ్‌గా..!

  • Miriyala Charu Recipe: జలుబు, జ్వరమా? ఐదు నిమిషాల్లో ఘాటైన ‘మిర్యాల చారు’.. అన్నమంతా దీనితోనే తినేస్తారు.!

  • Broccoli Soup Recipe : హెల్తీ అండ్ టేస్టీ.. ఇంట్లోనే క్రీమీ బ్రోకలీ సూప్.! కేవలం 20 నిమిషాల్లో రెడీ..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions