NTV Telugu Site icon

INDW vs WIW: భారత బౌలర్ల దెబ్బకి వెస్టిండీస్ బ్యాటర్లు విలవిల.. 44 పరుగులకే ఆలౌట్

Indw Vs Wiw

Indw Vs Wiw

INDW vs WIW: భారత మహిళల అండర్-19 టీ20 జట్టు ప్రపంచకప్‌లో తమ మొదటి మ్యాచ్‌లో అదిరిపోయే విజయం సాధించింది. వెస్టిండీస్ జట్టుతో జరిగిన ఈ మ్యాచ్‌లో భారత బౌలర్లు అద్భుత ప్రదర్శన చేసి వెస్టిండీస్ జట్టును కేవలం 44 పరుగులకే ఆలౌట్ చేశారు. ఇది మహిళల అండర్-19 టీ20 ప్రపంచకప్ చరిత్రలో వెస్టిండీస్ జట్టు సాధించిన అత్యల్ప స్కోరు. ఇక మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ జట్టు భారత బౌలర్ల దాడికి నిలవలేక 44 పరుగులకే వెస్టిండీస్ ఆలౌట్ అయ్యి అండర్-19 టీ20 ప్రపంచకప్ చరిత్రలో మూడో అత్యల్ప స్కోరును నమోదు చేసింది. ఇంతకుముందు మలేషియా 23 పరుగులతో అత్యల్ప స్కోరుగా రికార్డుకెక్కగా, జింబాబ్వే 25 పరుగులు మాత్రమే చేసి రెండో స్థానంలో ఉంది.

Also Read: Balakrishna: పార్టీలకు, కులాలకు అతీతంగా నేను సంపాదించిన ఆస్తి ఇదే- బాలయ్య

భారత జట్టు బౌలింగ్‌ను కెప్టెన్ నిక్కీ ప్రసాద్ అద్భుతంగా నిర్వహించింది. ఆరు మంది బౌలర్లను ఉపయోగించిన భారత జట్టు ప్రతీ బౌలర్ వెస్టిండీస్ బ్యాటింగ్‌ను కుదిపేసింది. భారత జట్టు ఈ విజయంతో టోర్నమెంట్‌లో తమ ఉనికిని నిరూపించింది. బౌలింగ్, ఫీల్డింగ్, క్రమశిక్షణతో పాటు జట్టుగా ప్రదర్శించిన నైపుణ్యం ప్రత్యర్థి జట్లకు సవాల్ విసిరింది. టోర్నమెంట్‌లో ముందుకు సాగుతున్న భారత జట్టు ఆత్మవిశ్వాసంతో మరో విజయం సాధించేందుకు సిద్ధంగా ఉంది. ఇక స్వల్ప లక్ష్య ఛేదనలో టీమిండియా కేవలం 4.2 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి విజయాన్ని కావాల్సిన పరుగులను రాబట్టింది. ఈ మ్యాచ్ లో టీమిండియా బౌలర్లు దెబ్బకు వెస్టిండీస్ జట్టులోని ఐదు మంది బ్యాటర్స్ ఒక్క పరుగు కూడా చేయలేక డక్ అవుట్ గా వెనుతిరిగారు. టీమిండియా బౌలర్లలో పరునిక అత్యధికంగా 3 వికెట్లు తీయగా.. జోషిత, ఆయుషి చెరో రెండు వికెట్లతో వెస్టిండీస్ జట్టును కోలుకోలేని దెబ్బ తీశారు.