Sugar Price: చక్కెర ధరల్లో పెరుగుదల ఈ ఏడాది కూడా కొనసాగవచ్చు. 2023-24 సీజన్‌లో మొదటి మూడు నెలల్లో చక్కెర ఉత్పత్తి 7.7 శాతం తగ్గి 113 లక్షల టన్నులకు పడిపోయింది. చెరకు ఉత్పత్తి తగ్గడంతో మహారాష్ట్ర, కర్ణాటకలో చక్కెర ఉత్పత్తి తగ్గింది. నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీస్ (NFCSF) దానికి సంబంధించిన డేటాను విడుదల చేసింది. ప్రస్తుత సీజన్‌లో డిసెంబర్ 2023 వరకు 511 ఫ్యాక్టరీలు ఇప్పటివరకు 1223 లక్షల టన్నుల చెరకును క్రషింగ్ చేశాయి. దేశంలోని మూడు ప్రధాన చక్కెర ఉత్పత్తి రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటకల్లో ఉత్పత్తి తగ్గుముఖం పట్టింది. చెరకు రసం నుంచి ఇథనాల్ ఉత్పత్తిని ప్రభుత్వం పరిమితం చేసింది. 2023-24 సీజన్‌లో దేశీయ వినియోగం కోసం దేశం 305 లక్షల టన్నుల కొత్త చక్కెరను ఉత్పత్తి చేస్తుందని అంచనా వేయగా, గత ఏడాది 2022-23 సీజన్‌లో ఇది 330.90 లక్షల టన్నులు ఉత్పత్తి అయింది. చక్కెర ఉత్పత్తిలో అతిపెద్ద రాష్ట్రమైన మహారాష్ట్ర డిసెంబర్ వరకు 38.40 లక్షల టన్నుల చక్కెరను ఉత్పత్తి చేసింది. అయితే గత సంవత్సరం 2022-23, 47.40 లక్షల టన్నులు ఉత్పత్తి చేయబడింది.
Read Also:Dr Saveera Parkash: “భారత్‌తో సంబంధాలు మెరుగుపరుస్తా”.. పాక్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న హిందూ మహిళా..
కర్ణాటకలో ఈ సీజన్‌లో 24 లక్షల టన్నుల చక్కెర ఉత్పత్తి చేయగా, గతేడాది 26.70 లక్షల టన్నులు ఉత్పత్తి జరిగింది. ఉత్తరప్రదేశ్‌లో డిసెంబర్ 2023 వరకు 34.65 లక్షల టన్నుల చక్కెర ఉత్పత్తి చేయబడింది. ఇది ఏడాది క్రితం 30.80 లక్షల టన్నులు. చలి పెరుగుదలతో చక్కెర ఉత్పత్తి పెరుగుతుంది. సీజన్ ముగిసే నాటికి ఉత్తరప్రదేశ్‌లో 115 లక్షల చక్కెర ఉత్పత్తి అవుతుందని అంచనా. మహారాష్ట్రలో 90 లక్షల టన్నులు, కర్ణాటకలో 42 లక్షల టన్నుల చక్కెరను ఉత్పత్తి చేయవచ్చు. తమిళనాడులో 12 లక్షల టన్నులు, గుజరాత్‌లో 10 లక్షల టన్నులు ఉత్పత్తి అవుతుందని అంచనా. రానున్న రోజుల్లో ఇథనాల్ ఉత్పత్తిపై ఆంక్షలు సడలించవచ్చని MFCSF MD ప్రకాష్ నాయకనవేర్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇంతకుముందు చక్కెర ఉత్పత్తి 290 లక్షల టన్నులుగా అంచనా వేయగా, ఇంకా 15 లక్షల టన్నులు పెరిగే అవకాశం ఉందని ఆయన చెప్పారు. ఎంఎఫ్‌సిఎస్‌ఎఫ్, ఇండియన్ షుగర్ మిల్స్ అసోసియేషన్‌లు ఈ దిశగా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని, తద్వారా చక్కెర కంపెనీలకు ఉపశమనం కలుగుతుందని చెప్పారు.
Read Also:BRS: ఇవాళ్టి నుంచి బీఆర్ఎస్ సమావేశాలు