Site icon NTV Telugu

Hydrogen-Powered Train: హైడ్రోజన్ రైలు తయారీలో కీలక పురోగతి.. గంటకు 40వేల లీటర్ల నీరు చాలు..

Hydrogen Train

Hydrogen Train

Hydrogen-Powered Train: భారత్ విద్యుత్, డీజిల్‌తో నడిచే సాంప్రదాయ రైళ్లను వదిలివేసి.. హైటెక్, సూపర్‌ఫాస్ట్ రైళ్ల నెట్‌వర్క్‌ను సృష్టించడంలో బిజీగా ఉంది. బుల్లెట్ రైలు, హైపర్‌లూప్, మోనో రైలుతో పాటు, హైడ్రోజన్ రైలు తయారీలో వేగం పుంజుకుంటోంది. ప్రస్తుతం జర్మనీ, ఫ్రాన్స్, స్వీడన్, యూకే, చైనా దేశాల్లో హైడ్రోజన్‌ రైళ్లు ప్రస్తుతం సేవలందిస్తున్నాయి. ఈ కాలుష్య రహిత రైళ్లు కలిగిన ఐదవ దేశంగా భారత్ అవతరించనుంది. ఇందులో భాగంగా.. మొదటి హైడ్రోజన్-శక్తితో నడిచే కోచ్ (భారతదేశంలో హైడ్రోజన్ పవర్డ్ ట్రైన్) శుక్రవారం చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ICF)లో విజయవంతంగా పరీక్షించారు. ఈ మేరకు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ సోషల్ మీడియా వేదికగా సమాచారం అందించారు. భారతదేశం 1200 హార్స్‌పవర్ హైడ్రోజన్ రైలును అభివృద్ధి చేస్తోందని పేర్కొన్నారు. అసలు ఏంటి ఈ హైడ్రోజన్ రైలు, ఇది ఎలా నడుస్తుంది? అనే అంశాల గురించి పూర్తిగా తెలుసుకుందాం…

READ MORE: JD Lakshmi Narayana Podcast: ఎమ్మెల్యేలకు గన్‌మెన్‌లు ఎందుకు..? పాడ్‌కాస్ట్‌లో జేడీ లక్ష్మీనారాయణ ఫైర్..

కాగా.. మొదటి రైలు హర్యానాలోని జింద్, సోనిపేట మధ్య 89 కిలోమీటర్ల దూరం నడుస్తుంది. ఈ రైలుకు 1,200 హెచ్‌పీ (హార్స్‌ పవర్‌) ఇంజిను అమర్చనున్నారు. గంటకు 110 కిలోమీటర్ల వేగంతో నడిచే విధంగా డిజైన్‌ చేశారు. గత ఏడాది కేంద్ర బడ్జెట్‌లో హైడ్రోజన్‌ రైలు ప్రాజెక్టును ప్రకటించారు. రూ.2,300 కోట్లతో 35 హైడ్రోజన్‌ రైళ్లను తయారు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రస్తుతం ఒక కోచ్ నిర్మాణం పూర్తయింది. తాజాగా విజయవంతంగా పరీక్షించారు. ఈ రైళ్ల వల్ల కర్బన ఉద్గారాలు, శబ్దం బాగా తగ్గుతాయి. రాబోయే హైడ్రోజన్-శక్తితో నడిచే రైలు అనేక ఆకట్టుకునే స్పెసిఫికేషన్లను కలిగి ఉంది. ఇది భారతదేశంలో అత్యంత అధునాతన రైళ్లలో ఒకటిగా నిలుస్తుంది. ఈ రైలు నడవడానికి హైడ్రోజన్‌ ఫ్యూయల్‌ టెక్నాలజీ వినియోగిస్తారు. హైడ్రోజన్‌, ఆక్సిజన్‌ కలిసి విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తాయి. తద్వారా నీటి ఆవిరి మాత్రమే బయటకు వెలువడుతుంది. ఈ రైలు నడిచేందుకు గంటకు 40వేల లీటర్ల నీరు అవసరం అవుతుంది. ఒకసారి ఫ్యూయల్‌ ట్యాంక్‌ నింపితే వెయ్యి కిలోమీటర్లు వెళ్లగలదు.

READ MORE: Cobra snake: విచిత్రం.. నాగుపామునే కరిచి చంపిన ఏడాది బాలుడు..

Exit mobile version