Site icon NTV Telugu

PM Modi – Ramaphosa: దక్షిణాఫ్రికా అధ్యక్షుడితో భారత ప్రధాని భేటీ.. ఏయే అంశాలపై చర్చించారంటే..

Pm Modi Ramaphosa

Pm Modi Ramaphosa

PM Modi – Ramaphosa: జీ 20 శిఖరాగ్ర సమావేశం సందర్భంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసాతో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. శనివారం జీ 20 నాయకుల సమావేశం ప్రారంభ సమావేశంలో ప్రసంగించిన ప్రధాని మోడీ.. ప్రపంచ అభివృద్ధి కొలమానాలను పునరాలోచించుకోవాలని పిలుపునిచ్చారు. మాదకద్రవ్య – ఉగ్రవాద నెట్‌వర్క్‌లను ఎదుర్కోవడానికి, ప్రపంచ ఆరోగ్య సంరక్షణ ప్రతిస్పందన బృందాన్ని రూపొందించడానికి జీ20 చొరవను తీసుకోవాలని ఆయన ప్రతిపాదించిన విషయం తెలిసిందే.

READ ALSO: Chiranjeevi: చిరంజీవి ఎమోషనల్ పోస్టు: అనిల్‌ రావిపూడి ప్రతి క్షణాన్ని ప్రత్యేకం చేస్తారు

ఏయే అంశాలపై చర్చించారంటే..
ఈ సమావేశం తర్వాత ప్రధాని మోడీ తన X ఖాతాలో ఒక పోస్ట్ చేశారు.. “జోహన్నెస్‌బర్గ్‌లో జరిగిన G20 శిఖరాగ్ర సమావేశం సందర్భంగా అధ్యక్షుడు సిరిల్ రామఫోసాతో నాకు చాలా మంచి సమావేశం జరిగింది. భారతదేశం – దక్షిణాఫ్రికా భాగస్వామ్యం అన్ని అంశాలను, ముఖ్యంగా వాణిజ్యం, సంస్కృతి, పెట్టుబడి, సాంకేతికత, నైపుణ్యాల అభివృద్ధి, AI, కీలకమైన ఖనిజాలలో సహకారాన్ని విస్తరించడం గురించి మేము చర్చించాము” అని వెల్లడించారు. “అధ్యక్షుడు రామఫోసా విజయవంతమైన G20 అధ్యక్ష పదవికి అభినందనలు కూడా” అని ప్రధాని పోస్ట్ చేశారు. జోహన్నెస్‌బర్గ్‌లో జరిగిన జీ20 శిఖరాగ్ర సమావేశం రెండవ సెషన్ విపత్తులు, వాతావరణ మార్పులు, న్యాయమైన ఇంధన పరివర్తన, బలమైన ఆహార వ్యవస్థ మధ్య సురక్షితమైన ప్రపంచాన్ని నిర్మించడంపై దృష్టి సారించిందని ప్రధానమంత్రి ఈ పోస్ట్‌లో రాశారు. మానవ కేంద్రీకృత, సమ్మిళిత భవిష్యత్తును నిర్ధారించడానికి భారతదేశం అన్ని రంగాలలో నిరంతరం కృషి చేస్తోందని ఆయన తెలిపారు.

ప్రధానిని కలిసిన పలువురు నాయకులు..
శిఖరాగ్ర సమావేశ వేదిక వద్దకు చేరుకున్న ప్రధానమంత్రి మోడీని దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసా నమస్తేతో స్వాగతించారు. జీ20 శిఖరాగ్ర సమావేశాల సందర్భంగా ప్రధాని మోడీ శనివారం బ్రిటిష్ ప్రధాని కీర్ స్టార్మర్, ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే-మ్యుంగ్, బ్రెజిల్ అధ్యక్షుడు లూలా డా సిల్వా, తదితర అనేక మంది ప్రపంచ నాయకులతో సమావేశమై ద్వైపాక్షిక ప్రయోజనాల అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా భారత ప్రధాని X లో ఒక పోస్ట్ చేస్తూ.. “జోహన్నెస్‌బర్గ్‌లో ప్రధాన మంత్రి కీర్ స్టార్మర్‌ను కలవడం చాలా బాగుంది. ఈ సంవత్సరం భారతదేశం-యుకె భాగస్వామ్యంలో కొత్త శక్తిని నింపింది.. ” అని ప్రధాని వెల్లడించారు. దక్షిణాఫ్రికాలో శుక్రవారం ప్రారంభమైన మూడు రోజుల G20 నాయకుల శిఖరాగ్ర సమావేశం ప్రత్యేకమైనది ఎందుకంటే ఇది మొదటిసారిగా ఆఫ్రికన్ ఖండంలో జరుగుతోంది.

READ ALSO: ‘Raju Weds Rambayi’ : కంటెంట్‌తో ప్రేక్షకులను కట్టిపడేసిన ‘రాజు వెడ్స్ రాంబాయి’- డే 2 కలెక్షన్స్

Exit mobile version