మంగళవారం జరిగిన అండర్-19 ప్రపంచ కప్ సూపర్ సిక్స్ మ్యాచ్‌లో భారత్, జింబాబ్వేను 204 పరుగుల భారీ తేడాతో ఓడించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 352 పరుగులు చేసింది. జింబాబ్వే 37.4 ఓవర్లలో 148 పరుగులకు ఆలౌట్ అయింది. భారత్ తరపున విహాన్ మల్హోత్రా అద్భుతమైన సెంచరీ సాధించాడు. 107 బంతులు ఎదుర్కొని ఏడు ఫోర్లతో 109 పరుగులు చేశాడు. అభిజ్ఞాన్ కుందు 62 బంతుల్లో ఐదు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 61 పరుగులు చేశాడు. వైభవ్ సూర్యవంశీ కూడా అర్ధ సెంచరీ చేశాడు. వైభవ్ 30 బంతుల్లో నాలుగు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 52 పరుగులు చేశాడు.
Also Read:Case Filed on Perni Nani: మాజీ మంత్రి పేర్ని నానికి బిగ్ షాక్.. ఈ సెక్షన్ల కింద కేసు నమోదు
జింబాబ్వే ఇన్నింగ్స్‌లో కేవలం ముగ్గురు బ్యాట్స్‌మెన్ మాత్రమే రెండంకెల స్కోరు సాధించారు. లెరాయ్ చివులా ఏడు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 62 పరుగులతో అగ్రస్థానంలో నిలిచాడు. కియాన్ బ్లిగ్నాట్ 37, టటెండా చిముగోరో 27 పరుగులు చేశారు. భారత్ తరఫున ఉదయ్ మోహన్, కెప్టెన్ ఆయుష్ మాత్రే చెరో మూడు వికెట్లు పడగొట్టగా.. ఆర్ఎస్ అంబ్రిస్ రెండు వికెట్లు పడగొట్టగా.. హెనిల్ పటేల్, ఖిలాన్ పటేల్ చెరో వికెట్ తీశారు.
