NTV Telugu Site icon

Paris Olympics 2024: ఒలింపిక్స్‌లో నేటి భారత్ షెడ్యూల్ ఇదే.. అందరి కళ్లు నీరజ్‌ చోప్రాపైనే!

Neeraj Chopra

Neeraj Chopra

Olypics 2024 Schedule India: పారిస్ ఒలింపిక్స్‌లో నేడు భారత అథ్లెట్లు కీలక పోటీలలో పాల్గొననున్నారు. పురుషుల జావెలిన్‌ త్రో క్వాలిఫికేషన్ ఈవెంట్ నేడు ప్రారంభం కానుంది. భారత్ నుంచి నీరజ్‌ చోప్రా, కిశోర్‌ జెనా బరిలోకి దిగనున్నారు. అందరి కళ్లు మాత్రం నీరజ్‌ పైనే ఉన్నాయి. టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం గెలిచిన నీరజ్.. పారిస్ ఒలింపిక్స్‌లో కూడా గోల్డ్ కొడతాడని అందరూ ధీమాగా ఉన్నారు. ప్రస్తుతం దేశం మొత్తం నీరజ్ చోప్రా నామస్మరణతో ఊగిపోతోంది.

భారత్ షెడ్యూల్ ఇదే:
టేబుల్‌ టెన్నిస్‌: పురుషుల టీమ్‌ ప్రిక్వార్టర్స్‌ (భారత్‌ × చైనా)- మధ్యాహ్నం 1.30
మహిళల టీమ్‌ క్వార్టర్స్‌ (భారత్‌ × అమెరికా/జర్మనీ)- సాయంత్రం 6.30

అథ్లెటిక్స్‌:
పురుషుల జావెలిన్‌ త్రో క్వాలిఫికేషన్‌ (కిశోర్‌ జెనా)- మధ్యాహ్నం 1.50
పురుషుల జావెలిన్‌ త్రో క్వాలిఫికేషన్‌ (నీరజ్‌ చోప్రా)- మధ్యాహ్నం 3.20
మహిళల 400మీ పరుగు రెపిచేజ్‌ రౌండ్‌ (కిరణ్‌ పాహల్‌)- మధ్యాహ్నం 2.50

రెజ్లింగ్‌: మహిళల 50 కేజీల ప్రిక్వార్టర్స్‌ (వినేశ్‌ × సుసాకి)- మధ్యాహ్నం 3

హాకీ: పురుషుల సెమీస్‌ (భారత్‌ × జర్మనీ)- రాత్రి 10.30