కేరళలోని వయనాడ్ నుంచి విజయం సాధించిన రాహుల్ గాంధీ ఆ స్థానం వైదొలగాలని భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. సార్వత్రిక ఎన్నికల్లో రాయ్‌బరేలి, వయనాడ్ నుంచి బరిలోకి దిగిన రాహుల్ రెండుచోట్లా విజయం సాధించారు. దీంతో ఏదో ఒక స్థానానికి రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాయ్‌బరేలీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ, వయనాడ్ స్థానానికి రాజీనామా చేయాలని రాహుల్ నిర్ణయించుకున్నట్లు సమాచారం . శనివారం జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో తన అభిప్రాయాన్ని వెల్లడించినట్టు తెలుస్తుంది . దీనిపై జూన్ 17న అధికారిక ప్రకటన వెలువడే అవకాశముంది. మరిన్ని వివరాలు కొరకు కింది వీడియో చుడండి.