NTV Telugu Site icon

IND vs NZ: ఆ ముగ్గురు బెంచ్‌కే పరిమితం.. న్యూజిలాండ్‌తో ఆడే తొలి టెస్టు తుది జట్టిదే!

Team India Test Team

Team India Test Team

IND vs NZ 1st Test: సొంతగడ్డపై టెస్టు ఫార్మాట్‌లో భారత జట్టు జైత్రయాత్రను కొసనగిస్తోంది. తాజాగా బంగ్లాదేశ్‌ను కుమ్మేసి.. సొంతగడ్డపై వరుసగా 18వ సిరీస్‌ను ఖాతాలో వేసుకుంది. ఇక రెట్టించిన ఉత్సాహంతో న్యూజిలాండ్‌తో మూడు టెస్టుల సమరానికి సిద్ధమైంది. బుధవారం (అక్టోబర్) నుంచి బెంగళూరు వేదికగా తొలి టెస్ట్ మ్యాచ్ జరగనుంది. వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ 2023-25 ఫైనల్‌కు అర్హత సాధించాలంటే.. ఈ సిరీస్ విజయం టీమిండియాకు ఎంతో కీలకం. అందుకే పటిష్ట జట్టుతో భారత్ బరిలోకి దిగనుంది.

ఓపెనర్లుగా రోహిత్ శర్మ, యశస్వీ జైస్వాల్ ఆడనున్నారు. ఇద్దరు కూడా ఇటీవలి కాలంలో దూకుడుగా ఆడేస్తున్నారు. న్యూజిలాండ్‌పై కూడా అలానే ఆడనున్నారు. మూడవ స్థానంలో శుభ్‌మన్ గిల్, నాలుగో స్థానంలో విరాట్ కోహ్లీ బరిలోకి దిగుతారు. కోహ్లీ మంచి ఇన్నింగ్స్ బాకీ ఉన్నాడు. కేఎల్ రాహుల్‌ కొనసాగనున్న నేపథ్యంలో ఇటీవల ఇరానీ కప్‌లో డబుల్ సెంచరీ సాధించిన సర్ఫరాజ్‌ ఖాన్ బెంచ్‌కే పరిమితం కానున్నాడు. ఆస్ట్రేలియా సిరీస్ ఉన్న కారణంగా రాహుల్‌ను కొనసాగించాలని టీమిండియా మేనేజ్మెంట్ భావిస్తోంది. ఇప్పట్లో భారత తుది జట్టులో సర్ఫరాజ్‌కు స్థానం దక్కే అవకాశం కనిపించట్లేదు.

ప్రధాన వికెట్‌ కీపర్‌గా రిషబ్ పంత్ ఆడనున్నాడు. దాంతో ధ్రువ్ జురెల్‌ కూడా బెంచ్‌కే పరిమితం కానున్నాడు. ముగ్గరు స్పిన్నర్లతో జట్టులోకి దిగాలని భారత్ భావిస్తోంది. రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాకు తోడుగా కుల్దీప్ యాదవ్ తుది జట్టులో ఆడే అవకాశాలు ఉన్నాయి. జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్ పేస్ బాధ్యతలు మోయనున్నారు. బంగ్లాపై అదరగొట్టిన ఆకాశ్ దీప్ తుది జట్టులో స్థానం కోసం ఎదురుచూడాల్సి ఉంది.

Also Read: Raptee.HV T30: ఒక్కసారి ఛార్జ్ చేస్తే 200కిమీ ప్రయాణం.. 8 సంవత్సరాల వారంటీ!

తొలి టెస్టుకు భారత్ తుది జట్టు (అంచనా):
రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వీ జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ (కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, కుల్‌దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్.

Show comments