Site icon NTV Telugu

India vs Pakistan U19: మరోసారి నో షేక్‌హ్యాండ్స్.. చర్చనీయాంశమైన ఇండియా–పాక్ మ్యాచ్

India Vs Pakistan U19

India Vs Pakistan U19

India vs Pakistan U19: దుబాయ్‌లోని ఐసీసీ అకాడమీ గ్రౌండ్‌లో డిసెంబర్ 14 (ఆదివారం) జరిగిన ఆసియా కప్ మ్యాచ్‌లో భారత అండర్-19 జట్టు పాకిస్థాన్ అండర్-19 జట్టుతో కరచాలనం చేసే సంప్రదాయాన్ని పాటించలేదు. అయితే ఐసీసీ రెండు జట్లను ప్రీ-మ్యాచ్ ప్రోటోకాల్స్‌ను పాటించాలని కోరినప్పటికీ, భారత కెప్టెన్ ఆయుష్ మాత్రే – పాకిస్థాన్ కెప్టెన్ ఫర్హాన్ యూసుఫ్ షేక్‌హ్యాండ్స్ ఇచ్చుకోలేదు.

READ ALSO: Congress: మోడీ ఆత్మవిశ్వాసం దెబ్బతింది, బీజేపీ ఓటమి తప్పదు.. ‘‘ఓట్ చోరీ’’ ర్యాలీలో రాహుల్ గాంధీ

పలు నివేదికల ప్రకారం.. ఐసీసీ టోర్నమెంట్‌ను రాజకీయాలకు దూరంగా ఉంచాలని కోరుకుంది, అలాగే ఆటగాళ్లు ఆట స్ఫూర్తిలో ఉన్న మర్యాదలను పాటిస్తారని ఆశిస్తున్నట్లు తెలిపింది. అలాగే ఆటగాళ్లకు ఇంకా నిర్దిష్ట సూచనలు ఏవీ జారీ కాలేదని, అయితే బోర్డు తన వైఖరిని జట్టు మేనేజర్ ఆనంద్ దాతర్‌కు తెలియజేస్తుందని సమాచారం. ఈ టోర్నీలో టీమిండియా – పాకిస్థాన్ జట్లు వారివారి జర్నీలను విజయాలతో ప్రారంభించాయి. భారతదేశం UAEని ఓడించగా, పాకిస్థాన్ మలేషియాపై గెలిచింది. ప్రస్తుతం జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా ముందుగా బ్యాటింగ్‌కు దిగి 270 పరుగులకు ఆలౌట్ అయ్యింది.

కొనసాగుతున్న హ్యాండ్‌షేక్ వివాదం
సీనియర్ పురుషుల ఆసియా కప్, మహిళల ప్రపంచ కప్, రైజింగ్ స్టార్స్ ఆసియా కప్ వంటి ఇటీవల జరిగిన టోర్నమెంట్లలో భారత జట్లు పాకిస్థాన్ జట్లతో కరచాలనం చేయకుండా దూరంగా ఉన్నాయి. భారత సైన్యం, పహల్గాం ఉగ్రవాద దాడి బాధితులకు సంఘీభావానికి టీమిండియా ఆటగాళ్లు పాకిస్థాన్ ఆటగాళ్లతో షేక్‌హ్యాండ్స్ ఇవ్వడం లేదు. అయితే మహిళా అంధుల T20 ప్రపంచ కప్‌లో భారతదేశం – పాకిస్థాన్ క్రీడాకారిణులు కరచాలనం చేసుకున్నారు. ఈ సంఘటన ప్రపంచం దృష్టిని విశేషంగా ఆకర్షించింది. ఎందుకంటే రెండు దేశాల అంధ క్రికెటర్లు రాజకీయ ఉద్రిక్తతలను పక్కనపెట్టి, ఆట స్ఫూర్తితో పరస్పర గౌరవాన్ని ఇచ్చిపుచ్చుకున్నాయి.

READ ALSO: Tilak Varma Dating: క్యూట్ క్రికెటర్‌తో తిలక్ వర్మ డేటింగ్‌..!

Exit mobile version